బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్స్ లిస్ట్‌ ఇదే..?

324
Bigg Boss
- Advertisement -

గత కొంతకాలంగా లాక్‌డౌన్‌ నేపథ్యంలో చిత్ర పరిశ్రమ కుదేలైపోయింది. క‌రోనా ప్రభావంతో గ‌త రెండు నెల‌లుగా ఎంటర్‌టైన్‌మైంట్ రంగానికి సంబంధించిన అన్ని ప‌నులు ఎక్క‌డిక్క‌డ ఆగిపోయాయి. జూలై లేదా ఆగ‌స్ట్ నుండి ఈ ప‌నులు ప్రారంభం కానున్న‌ట్టు తెలుస్తుంది. అయితే క‌రోనా వ‌ల‌న బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ ఈ ఏడాది ఉండ‌క‌పోవ‌చ్చ‌నే టాక్ మొద‌ట వినిపించ‌గా తాజాగా స్టార్ మా ఈ షోకి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్న‌ట్టు తెలుస్తుంది.

బిగ్ బాస్ సీజన్ 4 ప్రతి ఏడాది జూలై మొద‌టి వారంలో ప్రారంభం కానుండ‌గా, ఈ ఏడాది కూడా అదే టైంకి ప్రారంభించాల‌ని స్టార్ మా చాలా కాన్ఫిడెంట్‌గా ఉంద‌ట‌. ఇక ఇందులో కంటెస్టెంట్స్‌గా త‌రుణ్‌, వ‌ర్షిణి, మంగ్లీ, అఖిల్ స‌ర్తాక్ త‌దిత‌రులు ఉంటార‌ని తెలుస్తుంది. అన్న‌పూర్ణ స్టూడియోలోనే సీజ‌న్ 4 కూడా జ‌ర‌గ‌నుండ‌గా, ఈ కార్య‌క్ర‌మానికి హోస్ట్ ఎవ‌ర‌నే విష‌యం తెలియాల్సి ఉంది.

కాకపోతే ఈ మధ్య బిగ్ బాస్ సీజన్‌4కు మహేష్ బాబు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. దీనికి మా సంస్థ కూడా సూపర్ స్టార్‌కు భారీ మొత్తాన్ని ఆఫర్ చేసినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే బుల్లితెరపై మహేష్ బాబు కూడా హోస్ట్‌గా కనిపించనున్నారు.

- Advertisement -