సమంత అరుదైన రికార్డు!

202
samantha
- Advertisement -

ఏ మాయ చేశావే చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సమంత తక్కువ టైంలోనే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. దక్షిణాదిలో సమంత స్టార్ హీరోలందరితో నటించింది. అంతే కాదు తనకు మాత్రమే సాధ్యమైన నటన, హావభాలతో లక్షలాది మంది అభిమానులని సొంతం చేసుకుంది.

ఓ వైపు సినిమాలు.. మరోవైపు వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉన్న సమంత తాజాగా అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. తన ఫోటోతో ట్విట్టర్‌ ఎమోజీ పొందిన తొలి భారతయ నటిగా గుర్తింపు పొందింది.

ద ఫ్యామిలీ మ్యాన్‌ 2 వెబ్‌ సిరీస్‌తో ఓటీటీ ఎంట్రీ ఇచ్చిన సమంత… మనోజ్‌ బాజ్‌పేయితో కలిసి సంయుక్త ట్విట్టర్‌ ఎమోజీ దక్కించుకుంది. దీంతో ఇక నుంచి #TheFamilyMan2 అని ట్విట్టర్‌లో టైప్‌ చేస్తే… సమంత ఎమోజీ కనిపించనుంది. ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ .. రాజ్, డీకేలు తెర‌కెక్కించగా, ఇందులో ప్రియ‌మ‌ణి కూడా ముఖ్య పాత్ర పోషించింది.

- Advertisement -