సమంత సరికొత్త ఛాలెంజ్..!

142
samantha

అక్కినేని వారి కోడలు సమంత సరికొత్త ఛాలెంజ్‌కు శ్రీకారం చుట్టింది. కరోనా నేపథ్యంలో ఇంట్లోనే సేంద్రియ పద్దతిలో కురగాయలు పెంచేలా గ్రో విత్ మీ అనే ఛాలెంజ్‌ను ముందుకు తీసుకొచ్చింది. తనలాగే ఇంట్లోనే కూరగాయలు పెంచాలని సూచించిన సమంత…ఇందుకు మంచు లక్ష్మి, రకుల్ ప్రీత్ సింగ్‌లను నామినేట్ చేశారు సమంత.

ఇందుకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన సమంత…రాబోయే కొన్ని వారాల్లో సేంద్రియ పద్ధతిలో కూరగాయలు పండిద్దామని పిలుపునిచ్చారు. ఈ విధంగా చేయడం వల్ల మనలో ఎంతో మార్పు వస్తుందని తెలిపారు సమంత.

లాక్‌డౌన్‌ సమయంలో హైదరాబాద్‌ స్వగృహంలోని టెర్రస్‌పై ఏర్పాటు చేసుకున్న తోటలో సేంద్రీయ పద్దతుల్లో ఆకుకూరలతో పాట కూరగాయల్ని పండించింది.