గవర్నర్ వ్యాఖ్యలు సరికావు: మంత్రి ఎర్రబెల్లి

108
errabelli

కరోనా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై గవర్నర్ చేసిన వ్యాఖ్యలు సరికావన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. జనగామ జిల్లా పాలకుర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాట్లాడిన ఆయన ఉనికి కోసమే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ పథకాలు దేశానికే ఆదర్శమన్నారు.

బీజేపీ నాయకుల ఆరోపణలను పట్టించుకోవాల్సిన అవసరంలేదన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ర్టాల్లో కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చారా అని ఎర్రబెల్లి ప్రశ్నించారు. కరోనా నియంత్రణకు సీఎం కేసీఆర్‌ పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారన్నారు.

హైకోర్టు సైతం కరోనాపై ప్రభుత్వ పనీతీరును మెచ్చుకుందని. కేంద్రం,మంత్రులు సైతం ప్రశంసించారని కానీ కరోనా విషయంలో గవర్నర్ చేసిన వ్యాఖ్యలు సరికావన్నారు.