రోజుకు 9 లక్షల టెస్టులు..70 వేల కరోనా కేసులు

154
corona

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. రోజుకు 9 లక్షలకు పైగా కరోనా టెస్టులు చేస్తుండగా 70 వేలకు చేరువయ్యాయి కరోనా కేసులు. గత 24 గంటల్లో 69,652 కరోనా కేసులు నమోదుకాగా 977 మంది మృత్యువాతపడ్డారు. ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య 28 లక్షల మార్క్‌ను దాటాయి.

ఇప్పటివరకు దేశంలో 28,36,926 కరోనా కేసులు నమోదుకాగా 53,866 మంది కరోనాతో మృత్యువాతపడ్డారు. 20,96,665 మంది బాధితులు కరోనా మహమ్మారి నుండి కోలుకోగా 6,86,395 యాక్టివ్ కేసులున్నాయి.

గత 24 గంటల్లో 9 లక్ష‌ల‌ టెస్టులు నిర్వహించగా గ‌త 24 గంట‌ల్లో 60 వేల‌కుపైగా బాధితులు కోలుకుని డిశ్చార్జీ అయ్యార‌ని వెల్ల‌డించింది. దేశంలో రిక‌వ‌రీ రేటు 73 శాతం దాటింద‌ని తెలిపింది.‌