నాగచైతన్య నుంచి విడిపోయినా సమంతా ఇంకా ఆయనను మార్చిపోలేకపోతోందా?.. ఇంకా సమంత చైతన్య జ్ఙాపకాలతోనే జీవిస్తోందా అంటే.. అవును అన్న సమాధానమే వినిపిస్తోంది. సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉండే సమంత ఇటీవల కాలంలో పెడుతున్న పోస్టులు చూస్తే స్పష్టంగా అర్ధమవుతోంది. “నా లైఫ్ మునిపటిలా లేదు” అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ పోస్ట్ చూసిన ప్రతి ఒక్క నెటిజన్ సామ్ ఇంకా చై జ్ఞాపకాలతోనే ఉన్నట్లు కనిపిస్తోంది అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సమంత హెల్త్ కండీషన్ కూడా ఈ మధ్య కాలంలో అంతా బాలేదనే చెప్పాలి. మయో సిటీస్ వ్యాధితో బాధపడుతున్న సమంత గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉందనే చెప్పాలి. దానికి తోడు చైతో విడాకులు అనవసరంగా తీసుకున్నాననే భావనతో సమంత ఉందన్న ప్రచారం కూడా జరుగుతోంది. సమంత ప్రస్తుతం ఆరోగ్యం సరిగా లేక ట్రీట్మెంట్ తీసుకుంటోంది. మరోవైపు ఆమె నటించిన శాకుంతలం సినిమా త్వరలో విడుదల కాబోతోంది. అయితే సమంత మనసులో ఇంకా నాగచైతన్య ఉన్నాడంటూ వస్తున్న వార్తలతో సమంత, నాగచైతన్య మళ్లీ కలవాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.