మహానటి సావిత్రిగా సమంత…

312
Samantha all set to do 2 films

సావిత్రి అంటే తెలియని సినీ ప్రేక్షకులు ఉండరు . సినిమా పరిశ్రమ మొదలైన నాటినుండి నేటి వరకూ మహానటిగా కీర్తి గడించినదెవరంటే అందరి నోట వినిపించే ఏకైక పేరు సావిత్రి. అలాంటి మహానటి జీవితం ఇప్పడు వెండి తెరకెక్కనుంది. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన నాగ్ అశ్విన్ ఈ సినిమాని తీయబోతున్నాడు. ఒకే సారి తమిళ, తెలుగు భాషల్లో రూపొందనున్న ఈ సినిమాకి ‘మహానటి’అనే టైటిల్‌ కూడా ఫిక్స్‌చేశారట. గత కొంతకాలంగా ‘సావిత్రి’జీవిత విశేషాలపై రీసెర్చ్ చేస్తున్న నాగ్ అశ్విన్. ప్రస్తుతం సావిత్రి స్క్రిప్టుపైనే కసరత్తులు చేసి త్వరలోనే సినిమాని పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధం చేస్తున్నరట.

Samantha all set to do 2 films

సావిత్రి పాత్ర కోసం కొందరు హీరోయిన్స్ పేర్లు పరిశీలించినప్పటికీ ఆ అవకాశం సమంతని వరించింది. అయితే ఈ బయోపిక్ లో సావిత్రిగా ఎవరు నటిస్తారు అన్న దాని మీద ఎన్నాళ్ల నుండో చర్చలు జరిగాయి. అనుష్క, నిత్యా మీనన్ లాంటి వాళ్ల పేర్లు కూడా వినిపించాయి. ఏమాయ చేసావే సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన సమంత ఆ తర్వాత తెలుగు టాప్ హీరోయిన్ గా ప్రస్థానం కొనసాగించింది. ఈ అవకాశం సమంతని వరించడంతో పుల్‌ఖుషీగా ఉందట.

ఇటీవలే సమంత నాకు తెలుగు పరిశ్రమ నుంచి సరైన ఆఫర్స్ రావడం లేదు..అంటూ మీడియా దగ్గర వాపోయింది. అంతేకాకుండా… నాగ్ కోడలిని కానుండడంతో.. ఆఫర్స్ రావడం లేదని చెప్పింది. కానీ అటు సమంత మాటలకు విరుద్దంగా, ఓ సూపర్ ఆఫర్..అందులోనూ ఫెరఫార్మెన్స్ కు అవకాశం ఉన్న ఓ రోల్ సమంత దగ్గరకు చేరింది. దీంతో ఆమె తెగ సంబర పడిపోతుందట.

Samantha all set to do 2 films

సావిత్రి వృత్తిగత జీవితంలో ప్రముఖ నటులు ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ల పాత్రలు కీలకం. వారి పాత్రల్లో స్టార్‌ హీరోలు నటిస్తారని ప్రచారం సాగుతోంది. అయితే ఈ సినిమాపై ఇక ఎటువంటి అధికారిక సమాచారం మాత్రం వెలువడలేదు.