చరిత్రలో ఈ రోజు : డిసెంబర్ 11

277
today in history
- Advertisement -

{{డిసెంబర్ 11, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 345వ రోజు (లీపు సంవత్సరములో 346వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 20 రోజులు మిగిలినవి.}}

*సంఘటనలు*

1891: తెలుగునాట మొట్టమొదటి వితంతు పునర్వివాహం కందుకూరి వీరేశలింగం పంతులు ఆధ్వర్యంలో, రాజమండ్రిలో జరిగింది.
1911: నేపాల్ రాజు త్రిభువన్ అధికారంలోకి వచ్చాడు.
1946: భారత రాజ్యాంగ పరిషత్తు అధ్యక్ష ఎన్నికలలో రాజేంద్ర ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికైనాడు.
1946: ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ యునిసెఫ్ అమలులోకి వచ్చింది.
1965: హైదరాబాదు లోని రామచంద్రాపురంలో బి.హెచ్.ఇ.ఎల్ కర్మాగారాన్ని, నాటి భారత ప్రధానమంత్రి, లాల్‌ బహదూర్ శాస్త్రి ప్రారంభించాడు.
1967: పశ్చిమ భారతదేశములో వచ్చిన భూకంపము వలన 170 మంది మరణించారు. ఆ భూకంపము తీవ్రత రిక్టర్ స్కేలు పై 6.5గా నమోదు అయ్యింది

*జననాలు*

1882: సుబ్రహ్మణ్య భారతి, తమిళ కవి, స్వాతంత్ర్య యోధుడు. (మ.1921)
1896: గ్రంధి మంగరాజు, ప్రముఖ సినిమా పంపిణీదారుడు మరియు నిర్మాత.
1931: ఓషో, ప్రఖ్యాత భారతీయ ఆధ్యాత్మిక బోధకుడు. (మ.1990)
1934: సలీం దుర్రానీ, భారతదేశపు మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
1935: ప్రణబ్ ముఖర్జీ, భారత 13 వ రాష్ట్రపతి.
1948: రఘువరన్, దక్షిణ భారతదేశానికి చెందిన సుప్రసిద్ధ నటుడు. (మ.2008)
1967: మునిమడుగుల రాజారావు, తాత్విక రచయిత
1969: విశ్వనాథన్ ఆనంద్, భారత ప్రముఖ చదరంగ క్రీడాకాకారుడు.

*మరణాలు*

1756: థియోడోర్ వాన్ న్యుహాఫ్ జర్మన్ సాహసికుడు. కింగ్ ఆఫ్ కోర్సికాగా ప్రసిద్ధుడు. (జ.1694)
1783: రఘునాథరావ్, మరాఠా సామ్రాజ్యానికి చెందిన 13వ పేష్వా. (జ.1734)
2004: ఎం.ఎస్. సుబ్బలక్ష్మి, భారతదేశ ప్రముఖ గాయని. (జ.1916)
2011: మల్లెమాల సుందర రామిరెడ్డి, ప్రముఖ తెలుగు రచయిత మరియు సినీ నిర్మాత. (జ.1924)
2013: శ్రీకంఠదత్త నరసింహరాజ ఒడయార్, మైసూర్ రాజ కుటుంబం యొక్క వారసుడు. (జ.1953)

*పండుగలు మరియు జాతీయ దినాలు*

?అంతర్జాతీయ పర్వతదినము.
?యూనిసెఫ్ దినోత్సవం.

- Advertisement -