ఆటోలో సామ్.. ఫోటో వైరల్…

235
Samantha Akkineni Latest Movie Pic Viral
- Advertisement -

తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస సినిమాల హిట్స్ తో దూసుకుపోతోంది స్టార్ హీరోయిన్ సమంత. పెళ్లి తర్వాత కూడా ఆమె నటించిన సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. సామ్ ప్రస్తుతం కన్నడ రీమేక్ సినిమా యూటర్న్ షూటింగ్ లో బిజీగా ఉంది. పవన్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతన్న ఈ చిత్రంలో సామ్ జర్నలిస్టుగా కనిపించనుంది. ఓ ప్లై ఓవర్ పై జరగుతున్న వరుస ఆత్మహత్యల మిస్టరీని ఛేదించే జర్నలిస్టుగా నటిస్తోంది.

Samantha Akkineni Latest Movie Pic Viral

యూటర్న్ షూటింగ్ సమయంలో తీసిన సమంత పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాలో ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మరోవైపు సమంత ఈ సంవత్సరంలో నటించిన సినిమాలు సామ్ కి మంచి గుర్తింపుని తీసుకువచ్చాయి. మార్చ్ లో విడుదలైన రంగస్థలం బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో పల్లెటూరి అమ్మాయిగా నటించి విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. ఆమె జర్నలిస్ట్ గా నటించిన మహానటి సినిమా భారీ వసూళ్లు రాబుడుతోంది. ఇప్పుడు సామ్ యూ టర్న్ చిత్రంపైనే దృష్టి పెట్టింది. ఈ చిత్రంతో మరో ిహిట్ ను తన ఖాతాలో వేసుకోవాలని చూస్తుంది.

- Advertisement -