మహానటి టీజర్ వచ్చేంది..

233
Indian actor Savitri Mahanati teaser released
- Advertisement -

తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పర్చుకున్న నటి సావిత్రి. ఎన్టీఆర్, ఏన్నాఆర్, ఎస్వీఆర్, వంటి నటశిఖరాలతో ఆమె చేసిన పాత్రలు ఈనాటి సినీ ప్రేక్షకుల గుండెళ్లో ఇప్పటికి మెదులుతున్నాయి. తెలుగు పరిశ్రమలో మహానటీగా పేరుతెచ్చుకున్నారు సావిత్రి. ఆమె జీవిత కథ ఆధారంగా నాగ్ అశ్విన్ మహానటి చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

Indian actor Savitri Mahanati teaser released

తాజాగా ఈ మూవీ టీజర్‎ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. అనగనగా ఒక మహానటి అంటూ ప్రారంభమవుతోన్న ఈ టీజర్ ప్రేక్షకులను అలరిస్తోంది. సావిత్రిగా కీర్తి సురేష్‌ ఆమె పాత్రలో ఒదిగిపోయారు.ఇక ఈ చిత్రంలో సమంత మధురవాణిగా, విజయ్ దేవర కొండ విజయ్ ఆంటోనిగా కనిపించి కనువిందు చేశారు. ఇప్పటికే వీళ్ల ఫోటోలు సోషల్ మీడియాలో హల్‎చల్ చేస్తున్నాయి. ఇక టీజర్‎తో ప్రేక్షకులలో ఒక్కసారిగా సినిమాపై అంచనాలను పెంచేశాడు నాగ్ అశ్విన్. ఈ చిత్రాన్ని పలు భాషల్లో విడుదల చేయనున్నారు.

- Advertisement -