సమంత ఎంట్రీ.. అఖిల్ కు కలిసొస్తుందా?

339
Samantha Akhil

అక్కినేని అఖిల్ ఇప్పటివరకు మూడు సినిమాలు చేసిన ఒక్కటి కూడా విజయం సాధించిలేదు. దీంతో ఈసినిమాతో ఎలాగైన హిట్ కొట్టాలని అఖిల్ బాధ్యతలను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కు అప్పగించాడు కింగ్ నాగార్జున. అఖిల్ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈమూవీని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఈమూవీలో హీరోయిన్ గా పూజా హెగ్డె నటిస్తుంది. ప్రస్తుతం ఈమూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.

తాజాగా ఉన్న సమాచారం కోసం ఈమూవీలో సమంత నటించనుందనే వార్త ఫిలిం నగర్లో చక్కర్లుకొడుతుంది. కథ ప్రకారం ఈసినిమాలో ఓ గెస్ట్ రోల్ ఉందట. ఆ గెస్ట్ రోల్ కోసం చాలా మందిని ట్రై చేసిన చిత్ర యూనిట్ సంతృప్తిగా లేరని సమాచారం. అయితే సమంత అయితే కరెక్ట్ సెట్ అవుతుందని భావించారట. దీంతో వెంటనే సమంతను సంప్రదించారని తెలుస్తుంది. అఖిల్ సినిమా కాబట్టి చేసేందేంలేక సమంత తప్పకుండా ఒప్పుకుంది. ప్లాప్ లతో ఉన్న అఖిల్ కు సాయం చేసేందుకు సమంత ఈసినిమాను ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. సమంత ఎంట్రీతోనైనా మరి అఖిల్ హిట్ కొడతాడేమో చూడాలి మరి.