విరాళాల చోరీ..SP ఎంపీల నిరసన

1
- Advertisement -

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. పరీక్షల నిర్వహణలో అక్రమాలపై నిన్న సభలో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగిన నేపథ్యంలో నేడు రాహుల్ గాంధీ ప్రసంగించనున్నారు.

ఇక సమావేశాల ప్రారంభానికి ముందు రామ్ మందిర్ విరాళాల చోరీపై SP ఎంపీలు నిరసన చేపట్టారు. రామ్ మందిర్ విరాళాల నిధుల దుర్వినియోగం వ్యవహారంపై సమాజ్‌వాదీ పార్టీ (SP) ఎంపీలు పార్లమెంట్ భవనం వెలుపల ప్లకార్డులు పట్టుకుని “చందా చోర్ గద్దీ ఛోడ్” (చందాలు దొంగిలించిన వారు గద్ది దిగాలి) అంటూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.

సభలో బిల్లుపై చర్చ మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి ప్రారంభం కానుంది. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మధ్యాహ్నం 12:30లకు మాట్లాడనున్నారు.

Also Read:మోదీపై అసభ్యకర పోస్టులు..పోలీసుల నోటీసులు

- Advertisement -