ఈ డాక్టర్ల ప్రేమకు సెల్యూట్- ఎంపీ సంతోష్‌

433
mp santhosh
- Advertisement -

కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలకు తోడుగా.. తనవంతు బాధ్యతగా టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ఎన్నో అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నారు. ప్రజలకు తనకు తోచిన సాయం చేస్తూ అండగా నిలుస్తున్నారు. ఇక కరోనా నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అంతేకాదు కరోనా మహమ్మారి సోకకుండా తీసుకోవల్సిన జాగ్రత్తలు,సూచనలపై రకరకాల వీడియోలను షేర్ చేస్తుంటారు. మనస్సుకు హత్తుకునే సందేశాత్మక వీడియోలను కూడా ఆయన తన ట్విట్టర్ వేదికగా పంటుకుంటారు.

తాజాగా ఎంపీ సంతోష్‌ కుమార్‌ తన ట్విట్టర్‌లో ఓ వీడియోను పోస్ట్‌ చేశారు. చత్తీస్‌ఘడ్‌లోని రాయపూర్ ఎయిమ్స్‌లో చోటుచేసుకున్న ఘటన పలువురిని కదిలిస్తోంది. అమ్మకు కరోనా పాజిటివ్.. ఆ చిన్నారికి మూడు నెలలు. ఆ తల్లేమో ఆసుపత్రిలో చికిత్సపొందుతూ ఉండగా… చిన్నారి ఆలనా పాలనా చూసుకునేవారు కరువైయ్యరు. ఈ పరిస్థితుల్లో అక్కడున్న వైద్య సిబ్బంది.. ఆ చిన్నారిని సంరక్షించే బాధ్యత తీసుకున్నారు. ఆ పసి హృదయాన్ని చూసిన సిబ్బంది మనసు కలచివేసింది. వెంటనే ఆ చిన్నారిని దగ్గరికి తీసుకొని అన్నీ వారై చూసుకుంటున్నారు. అమ్మకు దూరంగా ఉన్న ఆ చిన్నారికి పాలు పట్టిస్తు ఎంతో ఆప్యాయంగా సుకుంటున్నారు. ఈ దృశ్యాలను అక్కడున్న వారిలో ఒకరు తమ సెల్‌ఫోన్‌లో చిత్రీకరించగా.. అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వీడియోని చూసిన ఎంపీ సంతోష్ కుమార్ తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ‘ధైర్యమంటే ఏంటో ఈ పోరాట యోధులు చూపిస్తున్నారు.. ఆ చిన్నారి తల్లి కరోనా పాజిటివ్‌తో బాధపడుతుంటే.. పసిబిడ్డకు తల్లి ప్రేమను వైద్యసిబ్బంది పంచుతున్నారు. వారి ప్రేమకు, సేవలకు సెల్యూట్’ అంటూ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

- Advertisement -