వారం రోజుల్లో రైతుల అకౌంట్‌లో డబ్బులు: హరీష్

208
harish
- Advertisement -

వడ్లు అమ్మిన రైతులకు వారం రోజుల్లో నేరుగా అకౌంట్లో డబ్బులు పడతాయని తెలిపారు మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లా గజ్వెల్ నియోజకవర్గం లోని వరదరాజ్ పూర్ ,సింగాటం గ్రామాలలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు హరీష్.

ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్.. దేశంలో ఎక్కడాలేని విధంగా ప్రతి గింజ కు మద్దతు ధర వచ్చే విధంగా ముఖ్యమంత్రి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో 7 వేల మక్కలు, వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగిందన్నారు.

ప్రతి రేషన్ కార్డు దారునికి 1500 రూపాయల చొప్పున రాష్ట్రమంతటా 13 వేల 14 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది కాబట్టి ప్రజలు బ్యాంకుల వద్ద గుమిగూడా వద్దు మీ పైసలు ఎక్కడికి పోవన్నారు.

వడ్లు అమ్మిన రైతులకు క్వింటాలుకు 1835 రూపాయలు మద్దతు ధర ఇస్తున్నాం కాబట్టి రైతులు టోకెన్ తీసుకొని కొనుగోలు కేంద్రానికి రావాలని.. వడ్లు అమ్మిన రైతుల కు వారం రోజుల్లో నేరుగా మీ అకౌంట్లో డబ్బులు పడతాయి దిగులు చెందాల్సిన అవసరం లేదన్నారు.

- Advertisement -