దుబాయ్‌లో జరిగిన ఐఫా వేడుకల్లో తన సినిమా కెరీర్‌లో పడ్డ కష్టాల గురించి తెలిపారు హీరో సల్మాన్ ఖాన్. బాలీవుడ్‌లో నేను దేవుడిగా భావించే వ్యక్తి రమేశ్ తౌరానీ. అసలు ఆయన లేకపోతే నా కెరీర్ లేదని తెలిపారు. మైనే ప్యార్ కియా లాంటి సినిమా రిలీజ్ అయ్యాక కూడా నాకు ఆరు నెలల వరకు ఆఫర్స్ లేవు. అప్పుడు మా నాన్న ప్రముఖ నిర్మాత జీపీ సిప్పీతో నేను సినిమా చేస్తున్నట్లు ఓ ఫిల్మ్ మ్యాగజైన్‌లో 2000 రూపాయలు ఇచ్చి ఫేక్ ప్రకటన చేశారు. అది చూసిన నిర్మాత రమేశ్ తౌరానీ సిప్పీ కార్యాలయానికి వెళ్లి ముందుగానే 5 లక్షలిచ్చి ఆ సినిమాలో భాగమవుతాను అన్నారు. అలా ఫత్తర్ కే ఫూల్ సినిమా మొదలైంది అని చెప్పారు.
సునీల్‌శెట్టి నాకు అన్నయ్య లాంటి వారు. నాకు ఆయనంటే చాలా అభిమానం అన్నారు. బోనీకపూర్ నా లైఫ్ లో చాలా సహాయం చేశారని తెలిపిన సల్మాన్ వరుస ఫ్లాప్స్ లో ఉన్నప్పుడు బోనినే పిలిచి నాకు వాంటెడ్ ,ఆ తర్వాత నో ఎంట్రీ ఇచ్చి నన్ను బాలీవుడ్‌లో నిలబెట్టరాని తెలిపారు.