కరోనా కారణంగా రెండేళ్ల పాటు బోనాల పండుగను నిర్వహించుకోలేదని ఈ సారి ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. బోనాల పండుగ ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించిన తలసాని…బోనాలను అత్యంత వైభవంగా నిర్వహించాలనే ఆలోచనతో ప్రభుత్వం 15 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని వెల్లడించారు. బో
జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో రహదారుల మరమ్మతులు, శానిటేషన్ విభాగం ఆధ్వర్యంలో దేవాలయాల పరిసరాలలో పారిశుధ్య కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు.భక్తుల సౌకర్యార్థం పలు ప్రాంతాల్లో ఎల్ఈడీ స్క్రీన్ లు, త్రీడీ మ్యాపింగ్ లు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. తెలంగాణ సంస్కృతి,సాంప్రదాయాలు ఉట్టిపడేలా బోనాల పండుగను నిర్వహిస్తామన్నారు.
ఈనెల 30వ తేదీ నుంచి నగరంలో బోనాల సందడి ప్రారంభం కానుంది. ఈనెల 30వ తేదీన గోల్కొండ బోనాలు ప్రారంభంకానున్నాయి. జులై 10న ఘటల ఊరేగింపుతో లష్కర్ బోనాలు మొదలవుతాయి. అనంతరం జులై 17వ తేదీన సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు నిర్వహిస్తారు. జులై18న బోనాల మరుసటి రోజు రంగం నిర్వహించి భవిష్యవాణి వినిపిస్తారు.

