బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తనదైన చమత్కారమైన మాటలతో ప్రేక్షకులను నవ్విస్తుంటారు. తాజాగా తన కొత్త సినిమా ‘మాతృభూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్’ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలోనూ ఆయన సరదా వ్యాఖ్యలతో ఆకట్టుకున్నారు. ముంబైలో జరిగిన ఈ కార్యక్రమంలో ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సల్మాన్ ఇచ్చిన సమాధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సల్మాన్ ఖాన్ గతంలో పలువురు అందమైన నటీమణులతో కలిసి సినిమాల్లో నటించారు. ముఖ్యంగా ఐశ్వర్యరాయ్ బచ్చన్, కత్రినా కైఫ్, అనుష్క శర్మలతో ఆయన ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా ‘మాతృభూమి’ సినిమాలో చిద్రంగదా సింగ్‌తో కలిసి నటిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఓ జర్నలిస్ట్.. ఇంతమంది పొడవైన హీరోయిన్లతో సల్మాన్ ఖాన్‌కు మంచి కెమిస్ట్రీ ఎలా కుదిరిందని ప్రశ్నించారు. దీనికి ఆయన తనదైన శైలిలో ఆసక్తికరంగా స్పందించారు. ఈ సంభాషణకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.
ఇదే కార్యక్రమంలో చిద్రంగదా సింగ్ గురించి కూడా జర్నలిస్ట్ ప్రశ్నించారు. ఆమెతో కలిసి పనిచేయడంలో ఉన్న ప్రత్యేకత ఏమిటని, ఆమెకు ఉన్న మంచి లక్షణం ఏంటని అడిగారు. దీనికి సల్మాన్ ఖాన్ వెంటనే స్పందిస్తూ.. ‘నో ఇన్సెక్యూరిటీ అట్ ఆల్’ (ఆమెలో ఎలాంటి అభద్రతాభావం లేదు) అని సమాధానమిచ్చారు. ఆయన ఇచ్చిన ఈ సమాధానం అక్కడున్న వారిని ఆకట్టుకుంది. సోషల్ మీడియాలోనూ నెటిజన్లు ఈ వ్యాఖ్యపై ఆసక్తికరంగా స్పందిస్తున్నారు.
Also Read:ఓనర్ ఫోటోతో ఫేక్ మెసేజ్..రూ.కోటి స్వాహా!
సల్మాన్ ఖాన్, ఐశ్వర్యరాయ్ జంటగా సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన ‘హమ్ దిల్ దే చుకే సనం’ (1999) అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో అజయ్ దేవగణ్ కూడా కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రం ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోయే ప్రేమకథా చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.

