బాలీవుడ్ భాయ్ జాన్….సల్మాన్ ఖాన్ 51వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. 50 ఏళ్ల వయసులోనూ పర్ఫెక్ట్ బాడీ బిల్డింగ్‌తో.. ఏడాదికో బ్లాక్‌బస్టర్ సినిమాతో కుర్రకారుని తన మాయలో పడేసిన సల్మాన్…సినిమా సినిమాకి వైవిధ్యాన్ని చూపిస్తు ముందుకు సాగుతున్నాడు. బీవీ హోతో ఐసీ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సల్మాన్….తాజా ‘ట్యూబ్‌లైట్’ చిత్రం వరకు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేశారు. ఈ సినిమా 2017 రంజాన్‌కి ప్రేక్షకుల ముందుకురాబోతోంది.
పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు సల్లూభాయ్ గిఫ్ట్ నందించారు. ‘బీయింగ్ ఇన్ టచ్’ పేరుతో యాప్‌ను విడుదల చేశారు. ఈ యాప్ ద్వారా అభిమానులకు చేరువగా ఉంటానని 51వ పుట్టినరోజు నాడు ప్రామిస్ చేశారు. ఇప్పుడు మీరు ఈ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్‌లో డౌన్లోడ్ చేసుకోవచ్చని సల్మాన్ ట్విట్టర్లో ఒక వీడియోను షేర్ చేశారు. ఈ యాప్ వినియోగదారులకు ‘బీయింగ్ హ్యూమన్’లో ఆకర్షణీయమైన డిస్కౌంట్లు లభించే వెసులుబాటు ఉందట.
2008లో సల్మాన్ ‘10 కా దమ్’ అనే రియాల్టీ షోను హోస్ట్ చేశారు. ఈ షో అప్పట్లో టీఆర్పీ రేటింగ్స్‌లో భారత్‌లోనే తొలి స్థానంలో నిలిచింది. అంతేకాదు ఆయనకు బెస్ట్ యాంకర్‌గానూ అవార్డు తెచ్చిపెట్టింది. 2010 నుంచి దబాంగ్ ఖాన్ సెలబ్రిటీ రియాల్టీ షో ‘బిగ్‌బాస్’కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. బిగ్‌బాస్ నాలుగో సీజన్ నుంచి ఇప్పటివరకు వరుసగా సల్మానే వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.