తెరపై సన్నీలియోన్ జీవిత చరిత్ర..?

105
Sunny

సన్నీలియోన్ ఫోర్న్ స్టార్స్‌ బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ఒక్కో సినిమాతో తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకుంది. అంద చందాలతో కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టించింది. అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ కు ఉన్నంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకోలగలిగింది. బాలీవుడ్ కు వచ్చిన కొత్తలో ఈహాట్ లేడి అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నా..వాటన్నింటిని అధిగమించి ప్రస్తుతానికి తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఫోర్న్ స్టార్ నుంచి స్టార్ హీరోలతో నటించే వరకు ఎదిగింది.

రీసెంట్‌గా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తాజా చిత్రం ‘రాయిస్’లో ‘లైలా మే లైలా’ పాటకు స్టెప్పులేసి అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. దీంతో ఫుల్ ఖుషీగా ఉంది సన్నీ తన బయోపిక్ సినిమాపై ఓ ఆసక్తికర విషయాన్ని తెలిపింది.

sunny leone

ప్రస్తుతం బాలీవుడ్ లో బయోపిక్ ల పర్వం కొనసాగుతోందని…ఒక వేళ తన జీవిత చరిత్రను సినిమాగా తీస్తే, అందులో తన పాత్రలో విద్యాబాలన్ నటించాలని కోరుకుంటానని తెలిపింది. తన పాత్రకు విద్యాబాలన్ అయితేనే న్యాయం చేయగలదని చెప్పింది. అలాగే తాను సినిమాల్లో నటించేందుకు ఎలాంటి షరతులు విధించుకోలేదని స్పష్టం చేసింది. స్క్రిప్ట్ బాగుంటే..ఎలాంటి అబ్జెక్షన్స్ లేకుండా, పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేకూరుస్తానని చెప్పింది. సన్నీ జీవిత కథపై అమ్మడు నోరు విప్పడంతో..ఎవరికి తోసి నట్టు వారు సోషల్ మీడియాలో కామెంట్స్ వేస్తున్నారు. బయోపిక్ ల రూపంలో ఇప్పటికే బాలీవుడ్ లో చాలా సినిమాలే వచ్చాయి.

sunny leone

ప్రముఖ వ్యక్తుల జీవిత కథలను తెరపై ఆవిష్కరిస్తు మంచి విజయాలు సాధిస్తున్నారు. డర్టీపిక్చర్, మేరీకామ్, సుల్తాన్, ధోని, పాన్ సింగ్ తోమర్ ఇలా చాలా సినిమాలు బాకాఫ్సీస్‌ ను షేక్ చేశాయి. తాజాగా వచ్చిన దంగల్ కలెక్షన్స్ కురిపిస్తోంది. దీంతో బాలీవుడ్ తారలు బయోపిక్ పై కన్నేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే సన్నీ కూడా బయోపిక్ పై కామెంట్ చేసింది. మరి దీన్ని బాలీవుడ్ జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.