దర్శకుడు ప్రశాంత్ నీల్ రెబల్ స్టార్ ప్రభాస్ తో సలార్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పై ఇప్పటికే ఎన్నో పుకార్లు షికార్లు చేశాయి. అయితే, ఈ సినిమాకి సంబంధించి లేటెస్ట్ అప్ డేట్ ఏమిటంటే.. ప్రభాస్ పార్ట్ దాదాపు పూర్తి అయ్యింది. ఓ సాంగ్ షూటింగ్ మాత్రం పెండింగ్ ఉందని తెలుస్తోంది. ఈ సాంగ్ కూడా భారీ ఎత్తున షూట్ చేయాలని చూస్తున్నారట టీమ్. దానికోసం కోట్లలో ఖర్చు చేసి.. ఇప్పటికే ఓ సెట్ ను కూడా రూపొందిస్తున్నారట. ఈ సాంగ్ మొత్తం ఓన్లీ ప్రభాస్ పైనే షూట్ చేయనున్నారు.
నరసింహ సినిమాలో రజనీకాంత్ ఆర్థికంగా ఎదిగే సాంగ్ ఒకటి ఉంటుంది. ఆ సాంగ్ లాగే.. ఈ సాంగ్ కూడా సాగుతుందట. సాంగ్ లో ప్రభాస్ లుక్ కూడా అదిరిపోతోందట. ఇప్పటికే ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్ ఉంది. అందుకే, ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపడం ఖాయమని ప్రభాస్ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క ఈ సినిమా రైట్స్ పై క్రేజీ రూమర్స్ వినిపిస్తున్నాయి.
సలార్ ఏపీ రైట్స్ కోసం ఏకంగా రూ.100 కోట్ల ఆఫర్లు వస్తున్నాయట. నిజంగా ఇది సలార్ సృష్టించిన రికార్డే. మరి ఒక్క ఏపీ రైట్స్ కోసేమే అంత భారీ మొత్తం అంటే.. ఈ లెక్కన సలార్ చిత్ర వరల్డ్‌వైడ్ థియేట్రికల్ రైట్స్ రూ.200 కోట్లకు పైగా అమ్ముడు పోయే అవకాశం ఉంది. మొత్తానికి ప్రశాంత్ నీల్ – ప్రభాస్ రికార్డ్స్ క్రియేట్ చేసేలా ఉన్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను హోంబలే ఫిలింస్ బ్యానర్ అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తోంది.
ఇవి కూడా చదవండి…