సలార్..ఓటీటీలో ఎప్పుడో తెలుసా?

42
- Advertisement -

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సలార్.రెండు పార్టులుగా తెరకెక్కిన ఈ చిత్రం ఫస్ట్ పార్టు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక మొదటి షో నుండే పాజిటివ్ టాక్ రావడంతో ఎట్టకేలకు హిట్ కొట్టారు ప్రభాస్. ఇక పక్కా మాస్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్‌ని అందించింది.

ఈ చిత్రం బుల్లితెర పై ఏ ఛానల్ లో , ఓటీటీలో ఏ ప్లాట్‌ఫార్మ్ లో స్ట్రీమ్ కానుందో తెలుసా..?. ఇక ఈ సినిమా రైట్స్‌ని స్టార్‌ మా సొంతం చేసుకోగా ఓటీటీ రైట్స్‌ని నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. దాదాపు రూ.22 కోట్లకు సలార్ టీవీ రైట్స్ ని స్టార్ మా సొంతం చేసుకోగా నెట్‌ఫ్లిక్స్ సంస్థ దాదాపు 300 కోట్లకు పైగా చెల్లించి సలార్ హక్కులను పొందింది.

ఇక సినిమా విడుదలైన రెండు నెలల తర్వాతే స్ట్రీమింగ్ కానుండగా డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ మొత్తం బిజినెస్ 350 కోట్ల బిజినెస్ చేసింది సలార్.

Also Read:పుట్టగొడుగులు తింటున్నారా!

- Advertisement -