బహుబలి తర్వాత ప్రభాస్ కేజీఎఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రాబోతున్న సినిమా సలార్. ఇది రెండు భాగాలుగా రానుందని గతంలో వార్తలు షికార్లు చేసిన వాటిని బహాటంగా మూవీ మేకర్స్ అనౌన్స్ చేయలేదు. తాజాగా ఈ సినిమా కోసం కన్నడ స్టార్ దేవరాజ్ కూడా నటిస్తున్నారు. అయితే ఈయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో సలార్ సినిమా రెండు భాగాలుగా వస్తుందని తెలిపారు.
Also read: ‘బన్నీ క్లోజ్ ఫ్రెండ్’ తో రష్మిక
మొదటి భాగం కంటే రెండో భాగంలో నా క్యారెక్టర్ బాగా స్ట్రాంగ్‌గా ఉంటుందని అన్నారు. ముఖ్యంగా జగపతి బాబుతో కలిసి ఎక్కువగా రెండవ భాగంలో స్క్రీన్ షేర్ చేసుకుంటానని అన్నారు. అయితే ప్రస్తుతం మూవీ మేకర్స్ మాత్రం దీన్ని పై ఎవిధంగా స్పందించలేదు. ప్రభాస్‌కు జోడీగా శ్రుతిహాసన్ నటిస్తుండగా..పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Also read: సూర్య@42.. కంగువ టైటిల్ ఫిక్స్
హోంబలే ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈయేడాది సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ప్రభాస్ ఈ సినిమానే కాకుండా ప్రాజెక్ట్ కే మరియు మారుతి దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు. అలాగే ఆదిపురుష్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.