నార్త్‌లో సలార్‌!

9
- Advertisement -

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ యాక్షన్ చిత్రం ‘సలార్’. సలార్‌తో హిట్ కొట్టిన ప్రభాస్ …ప్రస్తుతం సలార్ 2 సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. 2025లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.

ఇక వెండితెరపైనే కాదు ఓటీటీలోనూ సలార్ కొత్త రికార్డులు సృష్టించింది. ఆ తర్వాత సౌత్‌లో బుల్లితెరపై కూడా ప్రేక్షకులను ఆకట్టుకోగా ఇప్పుడు నార్త్‌లో టెలివిజన్‌ ప్రీమియర్‌ వచ్చేసింది. ఈ సినిమా హిందీ శాటిలైట్ హక్కులు స్టార్ గోల్డ్ దక్కించుకోగా 25 నుండి ప్రీమియర్ కానుంది. ఐపీఎల్ మ్యాచులు స్టార్ట్ అయ్యే సమయం 7 గంటల 30 నిమిషాలకే సలార్ ని ప్రసారం చేయబోతున్నారు. మరి హిందీలో ఈ భారీ చిత్రానికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

Also Read:సన్‌రైజర్స్ సంచలన విజయం..

- Advertisement -