సలార్ పై లేటెస్ట్ విశేషాలు

33
- Advertisement -

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సలార్ మూవీ దేశవ్యాప్తంగా విడుదలైంది. కానీ ప్రభాస్ సొంత ఊరులో ఒక్క థియేటర్లో కూడా బెనిఫిట్ షో పడలేదు. భీమవరంలో సినిమా టికెట్స్ ని ఎక్కువ రేట్లకు టికెట్లు అమ్ముతున్నారంటూ గత 2 రోజులుగా ఆందోళన జరుగుతుంది. అభిమానుల ఫిర్యాదుతో ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకే టికెట్లు అమ్మాలని అధికారులు ఆదేశించారు. ఇక, ఆ రగడ కారణంతో భీమవరంలో బెనిఫిట్ షోలు ప్రీమియం కాలేదు.

మరోవైపు శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో విషాదం నెలకొంది. సలార్ విడుదల సందర్భంగా రంగా సినీ కాంప్లెక్స్ వద్ద ప్రభాస్ ఫ్లెక్సీ కడుతూ బాలరాజు (27) అనే అభిమాని కరెంట్‌ షాక్‌కు గురై మృతి చెందాడు. ఈ ఘటనలో మరో నలుగురు ఫ్యాన్స్‌కు గాయాలైనట్టు తెలుస్తోంది. మృతుడి కుటుంబసభ్యులు తమకు న్యాయం చేయాలంటూ రంగా సినిమా కాంప్లెక్స్ వద్ద ధర్నాకు దిగారు. పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చారు.

ఇక ప్ర‌భాస్ స‌లార్ మూవీ షో చూసిన ఆడియన్స్ ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. స‌లార్ బ్లాక్‌బ‌స్ట‌ర్ అని సూప‌ర్ హీరో సినిమాల లెవెల్‌లో ప్ర‌భాస్‌లోని హీరోయిజాన్ని ప్ర‌శాంత్ నీల్ అద్బుతంగా చూపించారని అంటున్నారు. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్ ఒక్కటి చాలు థియేటర్లో సీట్లు చింపేయడానికంటూ ట్వీట్లు చేస్తున్నారు. సినిమా అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉందంటూ పోస్టులు పెడుతున్నారు.

అన్నట్టు ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.

Also Read:JN 1 కరోనా వేరియంట్..ప్రమాదకారి కాదు

- Advertisement -