స‌లార్ డే1 కలెక్షన్స్ ఎంతో తెలుసా?

30
- Advertisement -

ఎంతో కాలంగా ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఎదురుచూసిన స‌లార్ సినిమా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. ఎన్నో అంచ‌నాల మ‌ధ్య రిలీజైన ఈ సినిమా మంచి టాక్‌తో దూసుకెళ్తుంది. ఇండియా వైడ్‌ గా డే1 మంచి బుకింగ్స్ అందుకున్న ఈ సినిమాకు రికార్డు ఓపెనింగ్స్ ద‌క్కడం ఖాయంగా క‌నిపిస్తోంది. సలార్ మూవీ డే1న ఈజీగా 150 కోట్ల గ్రాస్ అందుకుంటుంద‌ని ట్రేడ్ పండితులు అంటున్నారు. రేపటికి ఈ నెంబ‌ర్‌పై ఓ క్లారిటీ రానుంది. అన్నట్టు ఇండియాలోనే కాకుండా యూఎస్‌లో కూడా ఈ సినిమాకు మంచి బుకింగ్స్ న‌మోదయ్యాయి. కేవ‌లం ప్రీమియ‌ర్స్ తోనే 2 మిలియ‌న్ డాల‌ర్స్‌కు పైగా అందుకుంది.

పైగా ఫస్ట్ డే ముగిసిలోపే ఈ సినిమా ఇప్పుడు 2.5 మిలియ‌న్ డాల‌ర్ల మార్క్‌కు ద‌గ్గ‌ర‌లో ఉంది. వీకెండ్‌కు స‌లార్ 5 మిలియ‌న్ డాల‌ర్ల మార్క్ అందుకున్నా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదని ట్రేడ్ పండితులంటున్నారు. మొత్తానికి యూఎస్‌లో ‘స‌లార్’ క‌లెక్ష‌న్ల మోత‌ మోగిస్తోంది. మొత్తానికి ఎన్నో అంచ‌నాల మ‌ధ్య రిలీజైన స‌లార్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి టాక్ తో దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే సలార్ మూవీ విడుదల రోజే రికార్డును బ్రేక్ చేసింది. అమెరికాలో ఆరేళ్ల క్రితం విడుదలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా రికార్డును సలార్ బ్రేక్ చేసింది.

అజ్ఞాతవాసి ప్రీమియర్స్ నుంచి 1.52 మిలియన్ డాలర్స్ ను వసూలు చేసింది. తాజాగా ప్రీమియర్స్‌తోనే ప్రభాస్ 2 మిలియన్ మార్క్‌ను టచ్ చేశారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ సంతోషంలో తేలిపోతున్నారు. దీనికితోడు, ఈ సినిమా క్లైమాక్స్ లో ప్రభాస్ క్యారెక్టర్ కి ఒక ట్విస్ట్ ఇచ్చి ప్రభాస్‌ తో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ షర్ట్ విప్పించారు. ప్రభాస్ షర్ట్ లేకుండా కనపడడం ఆలస్యం.. ఫ్యాన్స్ వాళ్ల చొక్కాలని చింపేసుకుని ఈలలు, అరుపులు, డ్యాన్సులతో రచ్చరచ్చ చేశారు. మొత్తానికి సలార్ సినిమాకు ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమా చూసిన అభిమానులు బ్లాక్ బస్టర్ హిట్ అంటూ బయటకు వచ్చి రివ్యూలు ఇస్తున్నారు.

Also Read:24న బీఆర్ఎస్ ‘స్వేద పత్రం’

- Advertisement -