టీమిండియా వన్డే ఫార్మాట్ క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ భార్య సాక్షి ధోనీ చిక్కుల్లో పడ్డారు. తనకు రావాల్సిన మొత్తం ఇవ్వకుండా మోసం చేశారంటూ డెనిస్ అరోరా అనే వ్యక్తి గుర్గావ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సాక్షి ధోనీపై 420 కేసును నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. రోహిత్ ఎంఎస్ డి అల్మోడ్ ప్రై.లిమిటెడ్ అనే సంస్థకు సాక్షితో పాటు అరుణ్ పాండే, శుభావతి పాండే, ప్రతిమ పాండేలు రితి ఎమ్‌ఎస్‌డీ అల్మోడే ప్రైవేట్ లిమిటెడ్ అనే స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ కంపెనీకి డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారు.
వీరందరికీ ఈ కంపెనీలో సమాన షేర్లు ఉన్నాయి. అయితే గురుగ్రామ్‌కి చెందిన డెన్నిస్ అరోరా అనే వ్యక్తికి కూడా ఈ కంపెనీలో భాగంగా 39 శాతం షేర్ల వాటా ఉంది. కొన్ని కారణాల వల్ల అరోరా తన వాటాను ఓ ఒప్పందంపై ప్రస్తుత డైరెక్టర్లకు అమ్మేశాడు. ఒప్పందం ప్రకారం కంపెనీ డైరెక్టర్లు అరోరాకి రూ.11 కోట్లు ఇవ్వాలి. కానీ రూ.2.25 కోట్లు మాత్రమే ఇచ్చారు. మిగతా మొత్తం ఈ ఏడాది మార్చిలోనే ఇవ్వాల్సి ఉంది. కానీ సాక్షితో పాటు మిగతా డైరెక్టర్లు డబ్బు ఇవ్వలేదని అతను అందరిపై కేసు వేశాడు. ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉండే ధోనీకి ఇది కొంచెం ఇబ్బంది కలిగింస్తుంది.