ట్యాంక్‌బండ్‌పై అర్ధరాత్రి బర్త్‌డే సెలబ్రేషన్స్ వద్దు అని విజ్ఞప్తి చేశారు సీపీ సజ్జనార్. ట్యాంక్‌బండ్‌పై బర్త్‌డే సెలబ్రేషన్స్, కేక్ కటింగ్స్ చేయొద్దు…అర్ధరాత్రి రోడ్లపైకి వచ్చి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు అన్నారు.ట్యాంక్‌బండ్‌తో పాటు రహదారులు, చెరువులు, పార్కుల వద్ద వేడుకలు వద్దు అన్నారు.
రెండ్రోజుల క్రితం ట్యాంక్‌బండ్‌పై రోడ్డు ప్రమాదంలో ఆరేళ్ల చిన్నారి, కుటుంబసభ్యుడు మృతి…చిన్నారి పుట్టినరోజు నాడే విషాదం జరగడం కలచివేసింది అన్నారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించి ముందస్తు చర్యలపై సమీక్ష నిర్వహించామని.. ట్యాంక్‌బండ్‌పై వేడుకలు నిర్వహించడం నిబంధనల ప్రకారం నిషేధం ఉందన్నారు.
Also Read:జిల్లాల ఏర్పాటుకు పదేళ్లు..కేటీఆర్ దిశానిర్దేశం
పుట్టినరోజు వేడుకలను ఇళ్ల వద్ద లేదా సురక్షిత ప్రదేశాల్లోనే జరుపుకోవాలి…క్షణికానందం కోసం అమూల్యమైన ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టుకోవద్దు.. యువత, తల్లిదండ్రులు పోలీసుల సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు సజ్జనార్.

