భారత్‌తో టీ20 సిరీస్‌..డబుల్ షాక్!

2
- Advertisement -

భారత్‌తో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ముందు న్యూజిలాండ్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. గాయాల కారణంగా ఆ జట్టు ఆటగాళ్లు మార్క్ చాప్‌మన్, జాక్ ఫౌల్క్స్ సిరీస్‌కు దూరమయ్యారు. వీరి స్థానాల్లో ఆల్‌రౌండర్ జోష్ క్లార్క్‌సన్, ఫాస్ట్ బౌలర్ బ్లెయిర్ టిక్నర్‌లను జట్టులోకి తీసుకున్నట్లు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది.

అక్టోబర్ 22 నుంచి భారత్, న్యూజిలాండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ హాగ్లీ ఓవల్ వేదికగా జరగనుంది. అయితే, సిరీస్‌కు ముందు కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడటం న్యూజిలాండ్ జట్టుకు ఆందోళన కలిగిస్తోంది.

గత నెలలో జరిగిన యూరోపియన్ టీ20 లీగ్‌లో మార్క్ చాప్‌మన్ ఎడమ తొడ కండరాలకు గాయమైంది. దీంతో అతను భారత్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు అందుబాటులో ఉండటం లేదు. అయితే, భారత్‌తో జరిగే వన్డే సిరీస్ సమయానికి అతను కోలుకునే అవకాశం ఉందని న్యూజిలాండ్ జట్టు వర్గాలు తెలిపాయి.

మరోవైపు, ఇటీవల కాంటర్‌బరీ పురుషుల జట్టు శిక్షణ సమయంలో జాక్ ఫౌల్క్స్ కుడి తుంటి భాగంలోని కండరాలకు గాయమైంది. అతను తిరిగి మైదానంలోకి ఎప్పుడు అడుగుపెడతాడనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.

గాయపడిన ఇద్దరు ఆటగాళ్ల స్థానాల్లో ఆల్‌రౌండర్ జోష్ క్లార్క్‌సన్, ఫాస్ట్ బౌలర్ బ్లెయిర్ టిక్నర్‌లకు అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా న్యూజిలాండ్ ప్రధాన కోచ్ రాబ్ వాల్టర్ మాట్లాడుతూ.. మార్క్ చాప్‌మన్, జాక్ ఫౌల్క్స్ గాయపడటం బాధాకరమని, వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వారి స్థానాల్లో అనుభవం ఉన్న క్లార్క్‌సన్, టిక్నర్‌లను జట్టులోకి తీసుకునే అవకాశం లభించడం సంతోషంగా ఉందన్నారు. భారత్‌తో జరగనున్న టీ20 సిరీస్ ఆసక్తికరంగా సాగుతుందని, ఈ సిరీస్‌లో పాల్గొనేందుకు ఇద్దరు ఆటగాళ్లు ఎంతో ఉత్సాహంగా ఉన్నారని పేర్కొన్నారు.

Also Read: జిల్లాల ఏర్పాటుకు పదేళ్లు..కేటీఆర్‌ దిశానిర్దేశం

న్యూజిలాండ్ జట్టు:

మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మైకేల్ బ్రేస్‌వెల్, జోష్ క్లార్క్‌సన్, డెవాన్ కాన్వే, జాకబ్ డఫీ, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, బెవన్ జాకబ్స్, కైల్ జేమీసన్, ఆడమ్ మిల్నే, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, టిమ్ సీఫర్ట్, నాథన్ స్మిత్, బ్లెయిర్ టిక్నర్.

- Advertisement -