టాలీవుడ్ హీరోలు మంచు విష్ణు – సాయిధరమ్ తేజ్ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ప్రేమికుల రోజు సందర్భంగా సోలో బ్రతుకు గురించి తేజ్ చెప్పిన ఫిలాసఫీగా తనదైన శైలీలో సమాధానం చెప్పారు మంచు విష్ణు.
వాలెంటైన్స్ డే సందర్భంగా సోలో బ్రతుకుతో ఉన్న అడ్వాంటేజస్ గురించి చెప్పాడు సాయిధరమ్.
1. ఫోన్లో ఛార్జింగ్ అయిపోతే నేను పెద్దగా టెన్షన్ పడను.
2. రెస్టారెంట్‌కి వెళ్తే నా ఫుడ్‌కి మాత్రమే నేను పే చేస్తాను. (వాలెట్‌కి బొక్క పడే ఛాన్సే లేదు)
3. క్రికెట్ ఆడేటప్పుడు కాల్ వచ్చి గేమ్ మధ్యలో వెళ్లాల్సిన పని నాకు లేదు.
4. షూట్, క్రికెట్, జిమ్, హోమ్, ఫ్రెండ్స్ – నాకు నచ్చినంత టైమ్ నాకు నచ్చిన వాటితో నేను స్పెండ్ చేయొచ్చు అని పేర్కొన్నారు.
దీనికి స్పందించిన విష్ణు..తమ్ముడు, మై లిటిల్ బ్రదర్ సాయి ధరమ్ తేజ్. ఈ ట్వీట్ నేను సేవ్ చేసుకున్నా. ఇంకా ఎన్ని రోజులు సోలోనో చూస్తాగా. ఆల్ ది బెస్ట్ ఫర్ సోలో బ్రతుకే సో బెటర్ అంటూ రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం వీరిద్దరి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా విష్ణు అన్న మీ మాదిరిగా అందరికీ అదృష్టం ఉండాలి కదా అని రిప్లై ఇచ్చారు తేజు.