ఘనంగా సిద్దిపేట హైస్కూల్ ప్లాటినం జూబ్లీ ఉత్సవాలు

207
sabitha indrareddy
- Advertisement -

సిద్దిపేట హైస్కూల్ ప్లాటినం జూబ్లీ ఉత్సవాల్లో పాల్గొన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె తనకు ఈ కార్యక్రమంలో పాల్గొనే భాగ్యం కలిగినందుకు ఆనందాన్ని వ్యక్తం చేశారు.

75 సంవత్సరాలుగా ఒక పాఠశాల విద్యాసేవ చేయడం మామూలు విషయం కాదన్నాను నందిని సిద్ధారెడ్డి. ఎంతో మంది గురువులను,విద్యావేత్తలను,వివిధ ర్యాంగాల్లో మహోన్నత వ్యక్తులను ఈ పాఠశాల తయారు చేసిందన్నారు.

సిద్ధిపేట హైస్కూల్ ఎంతో మంది గొప్ప వ్యక్తులను తయారు చేసిందన్నారు ఫారుఖ్ హుస్సేన్. సీఎం కేసీఆర్, హరీష్ రావు దయతో విద్యారంగం అభివృద్ధి చెందుతోందన్నారు. కులాలు, మతాలకు అతీతంగా ఎంతో మంది ఈ పాఠశాలలో చదువుకొని దేశానికి,రాష్ట్రానికి సేవ చేస్తున్నారని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో నే పేరున్న ప్రభుత్వ పాఠశాల సిద్ధిపేట మల్టీ పర్ పస్ హైస్కూల్ అన్నారు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి. సమాజానికి ఎంతో మంది సైంటిస్టు లను,పారిశ్రామక వేత్తలను,రాజకీయ నాయకులను,క్రీడాకారుల ను ,అధికారులను అందించిందన్నారు. ఈ స్కూల్లో తాను చదువుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. పాఠశాల అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తానని చెప్పారు..

ఘన చరిత్ర కలిగిన ఈ పాఠశాల లో చదివినందుకు గర్వపడుతున్నానని చెప్పారు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్. తనకు ఈ పాఠశాల ఆటను , పాటను,పోరాట స్ఫూర్తి ని నింపిందన్నారు. ఈ వేడుకల్లో రెండు రోజులు పాల్గొని మీ తో కలిసి ఆడుతా పాడుతానని చెప్పారు.

సిద్ధిపేట జిల్లా లో ఇంత మంచి ప్రభుత్వ పాఠశాల ఉండడం గొప్ప విషయం అన్నారు జడ్పీ ఛైర్మన్ రోజా శర్మ. మంత్రి హరీష్ రావు గొప్పగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రాణాలు పెంచేందుకు హరీష్ రావు ఎంతో కృషి చేస్తున్నారని.. 10 వ తరగతిలో 100 శాతం ఉత్తీర్ణత సాధించేందుకు హరీష్ రావు నేతృత్వం లో కృషి జరుగుతోందన్నారు.

- Advertisement -