రజనీకాంత్ మూవీలో బిగ్ బాస్ విన్నర్

687
Rahul sipligunj With Rajinikanth
- Advertisement -

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ షో ద్వారా చాలా మంది ఫేమస్ అయ్యారు. నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ 3 టైటిల్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ కు చాలా క్రేజ్ వచ్చింది. అయితే బిగ్ బాస్ సీజన్ 1,2 విన్నర్ లకు బిగ్ బాస్ షో అయిపోయిన కొద్ది రోజుల మాత్రమే వీళ్లు పేర్లు వినిపించాయి. కానీ రాహుల్ కు మాత్రం అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. సింగర్ గానే కాకుండా నటుడిగా కూడా అతనికి అవకాశాలు వస్తున్నాయి. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత క్రియేటివ్ దర్శకుడు క్రిష్ణవంశీ రంగమార్తాండ సినిమాలో ఛాన్స్ కొట్టేశాడు.

rahul

ఈమూవీలో రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మికతో జోడిగా నటించనున్నాడు. రమ్యకృష్ణ, ప్రకాశ్ రాజ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కాగా తాజాగా రాహుల్ సిప్లిగంజ్ కు మరో బడా ఆఫర్ వచ్చింది. ఏకంగా సూపర్ స్టార్ రజనీకాంత్ మూవీలో ఛాన్స్ కొట్టేశాడు. శివ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రంలో మీనా, ఖుష్బూ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. కీర్తి సురేష్ మరో ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు. తాజాగా ఈచిత్రంలో రాహుల్ సిప్లిగంజ్ ముఖ్యపాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. రజనీకాంత్ తో రాహుల్ దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. ఏది ఏమైనా సింగర్ గానే కాకుండా యాక్టర్ గా కూడా రాణిస్తున్నాడు రాహుల్.

- Advertisement -