ఆ వార్త‌ల్లో నిజం లేదు..

201
saipallavi
- Advertisement -

తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఫిదా సినిమాతో అంద‌రిని త‌న‌వైపు తిప్పుకుంది క‌థానాయిక సాయిప‌ల్ల‌వి. ఒక్క సినిమాతో ఆమె తెలుగులో మంచి క్రేజ్ ఏర్ప‌ర్చుకుంది. ఆ సినిమా త‌రువాత అవ‌కాశాలు కూడా మెండుగా వ‌చ్చాయి. కానీ డ‌బ్బుకు ఆశ‌ప‌డ‌కుండా .. ఆ సినిమాలో ఆమె పాత్ర న‌చ్చితేనే ఒప్పుకుంటుంద‌నే మంచి పేరు సంపాదించుకుంది.

sai-pallavi-padi-padi-leche

మ‌రోవైపు హీరోల‌తో గొడ‌వ ప‌డుతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. మిడిల్ క్లాస్ అబ్బాయి స‌మ‌యంలో నానితోనూ గొడ‌వ ప‌డ్డార‌ని, క‌ణం సినిమా స‌మ‌యంలో నాగ‌శైర్య‌తోనూ, తాజాగా శ‌ర్వానంద్ తో ప‌డి ప‌డి లేచె మ‌న‌సు సినిమా షూటింగ్ స‌మ‌యంలో గొడ‌వప‌డింద‌ని ఫిలింన‌గ‌ర్ లో వార్తలు వినిపిస్తున్నాయి.

తాజాగా ఈ రూమ‌ర్ల‌కి ఫుల్ స్టాప్ పెట్టింది సాయిప‌ల్ల‌వి. శ‌ర్వానంద్ తో నాకు ఎలాంటి గొడ‌వ‌లు లేవు. నా వ‌ల‌న శ‌ర్వానంద్ షూటింగ్ కి రాలేదని వ‌స్తున్న వార్తలు అవాస్త‌వం. అత‌ను మ‌రో సినిమాలోనూ న‌టిస్తున్నాడు. అందుకే ప‌డి ప‌డి లేచె మ‌న‌సు సినిమా షూటింగ్ ఆగిపోయింద‌ని చెప్పుకొచ్చారు.

- Advertisement -