- Advertisement -
బీజేపీలో చేరడం ఆనందంగా ఉందన్నారు బ్యాడ్మింటర్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆధ్వర్యంలో కాషాయ కండువా కప్పుకున్నారు. సైనాతో పాటు ఆమె సోదరి చంద్రన్షు నెహ్వాల్ కూడా బీజేపీలో చేరారు.
ఈ సందర్భంగా మాట్లాడిన సైనా…దేశం కోసం పనిచేసే పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. తనకు కష్టపడే వారు అంటే ఇష్టం..దేశం కోసం కష్టపడుతున్న ప్రధాని మోడీ నేతృత్వంలో పని చేయాలని బీజేపీలో చేరానని చెప్పారు.
క్రీడా అభివృద్ధికి మోడీ ప్రభుత్వం ఎంతో చేసిందని…కష్టపడి దేశానికి సేవ చేయడానికి నా వంతు కృషి చేస్తానని తెలిపారు.
- Advertisement -