బిగ్ బాస్ 4… ఈ మూడింట్లో ఏదిజరిగినా గెలుపునాదే!

336
saikumar pampana

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 4 విజయవంగా 8 ఎపిసోడ్‌లను పూర్తిచేసుకుంది. తొలివారంలో ఎలిమినేషన్ ప్రక్రియంలో భాగంగా సూర్యకిరణ్‌ ఎలిమినేట్ కాగా తెలుగు బిగ్ బాస్ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా తొలివారంలోనే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్‌లోకి మరో కంటెస్టెంట్‌ని పంపారు బిగ్ బాస్.ఈరోజుల్లో,బస్ స్టాప్ సినిమాలతో పాపులర్ అయిన కుమార్ సాయిని హౌస్‌లోకి పంపించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సాయి…తాను బిగ్ బాస్‌లోకి ఎందుకువస్తున్నానో తెలిపి అందరికి సర్‌ప్రైజ్ ఇచ్చారు.

మూడు వ్యూ పాయింట్స్‌తో బిగ్ హౌస్‌లోకి వచ్చానని వచ్చానని.. బిగ్ బాస్‌ విన్నర్‌గా నిలవాలనే ఆశతో పాటు రెండోది తాను బయటికి వచ్చేసరికి కరోనా వ్యాక్సిన్ వచ్చి అందరూ హ్యాపీగా ఉంటారని తెలిపాడు.ఇక ముఖ్యంగా నాగార్జునతో పరిచయం అవుతుందని.. తద్వారా తన దగ్గర ఉన్న కథను చెప్పడం ఈజీ అవుతుందని ఇక్కడకు వచ్చినట్టు చెప్పాడు సాయి. ప్రస్తుతం యాక్టింగ్‌ని పక్కకు పెట్టి స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నానని హౌస్‌ నుండి బయటకు వచ్చిన తర్వాత కథ చెప్పాలని ఆశగా ఉందన్నారు. ఈ మూడింటిలో ఏది జరిగినా తాను గెలిచినట్టే సాయి చెప్పుకొచ్చారు.