అక్షత్ వర్మ దర్శకత్వలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘కాలాకాండి’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను సెప్టెంబర్ 8న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ భావించింది. అయితే ఉహించని విధంగా సెన్సార్ బోర్డు చిత్ర యూనిట్‌కి షాకిచ్చింది.
ఈ సినిమాలో 73 సన్నివేశాలను తొలగించాలని సెన్సార్ బోర్డు ఆదేశించింది. సినిమాలో మరీ ఎక్కువగా అసభ్య పదాలు ఉన్నాయని, ఎవరూ అలాంటి పదాలు విని ఉండరని సీబీఎఫ్‌సీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటివరకు సీబీఎఫ్‌సీ ఏ సినిమాకూ ఇన్ని కత్తిరింపులు ఇవ్వలేదు.
దీంతో ఆలోచనలో పడ్డ చిత్రయూనిట్ ప్రస్తుతానికి సినిమాను విడువలను వాయిదా వేసిన చిత్రయూనిట్ సెన్సార్ బోర్డ్ తో యుద్ధనికి రెడీ అవుతోంది. ఈ సినిమాలో సైఫ్ సరికొత్త గెటప్‌లో కనిపించనున్నాడు. ఇటీవల బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ నటించిన ‘బాబూమోషాయ్ బందూక్‌బాజ్’ చిత్రానికి సెన్సార్ బోర్డు 40 కత్తిరింపులు విధించించగా తాజాగా వాటిని 8కి తగ్గించింది.మరి సైఫ్ సినిమాకు చివరగా సెన్సార్ ఎన్నికత్తిరింపులు విధిస్తుందో చూడాలి…