హాలీవుడ్ రేంజ్‌లో అజిత్

257
Vivegam Official Tamil Trailer
- Advertisement -

త‌మిళ స్టార్ హీరో అజిత్ క‌థానాయ‌కుడుగా రూపొందుతున్న చిత్రం `వివేగం`. టి.జి.త్యాగరాజన్ సమర్పణలో స‌త్య‌జ్యోతి ఫిలింస్ బ్యాన‌ర్‌పై సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని వంశ‌ధార క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై న‌వీన్ శొంఠినేని తెలుగు ప్రేక్ష‌కుల‌కు `వివేకం` పేరుతో అందిస్తున్నారు. అల్రెడి విడుద‌లైన తెలుగు టీజ‌ర్ ఇప్ప‌టికే సెన్సేష‌న్ క్రియేట్ చేసింది.

110 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో జేమ్స్ బాండ్ త‌ర‌హా మూవీగా వివేకం తెర‌కెక్కుతోంది. తొలిసారి అజిత్ సరసన కాజల్ హీరోయిన్‌గా నటిస్తుండగా గెస్ట్ పాత్రలో అక్షర హాసన్‌ మెప్పించనుంది. ర‌క్త‌చ‌రిత్ర చిత్రంలో తెలుగు ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన బాలీవుడ్ న‌టుడు వివేక్ ఒబ్‌రాయ్ ఈ చిత్రంలో కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నారు.

అజిత్ హీరోగా వీరం, వేదలం లాంటి సూపర్ హిట్ సినిమాలను అందించిన శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమా భారీ అంచనాలు ఉన్నాయి. ఆగస్ట్ 24న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంలో విడుదల చేయాలని భావిస్తుండగా, రీసెంట్ గా చిత్ర ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులో విజువల్స్ తో పాటు అనిరుధ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ప్రతీ సీన్ చాలా కొత్తగా ఉండడంతో ఆడియన్స్ థ్రిల్ ఫీలవుతున్నారు. ఆ ట్రైలర్‌ పై మీరు ఓ లుక్కేయండి…

- Advertisement -