తేజు…సోలో బ్రతుకే సో బెటర్‌ అప్‌డేట్‌!

153
sai tej

సుబ్బు దర్శకత్వంలో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న చిత్రం సోలో బ్రతుకే సో బెటర్‌. చిత్రలహరి సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కిన తేజు…ఈ సినిమాతోనూ సక్సెస్ కొట్టి 2020ని విజయవంతంగా ముగించాలని భావిస్తున్నారు.

తేజు సరసన నభానటేష్ హీరోయిన్‌గా నటిస్తుండగా సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని గుమ్మడికాయ కొట్టేసింది చిత్రయూనిట్. ఈ విషయాన్ని చిత్రబృందం అఫిషియల్‌గా ప్రకటించింది. సరదాగా సాగిన మా సోలో బ్రతుకే సో బెటర్ సినిమా షూటింగ్ పూర్తయ్యిందని తెలిపారు.

ఇక ఈ సినిమా తర్వాత దర్శకుడు సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు దర్శకత్వంలో థ్రిల్లర్‌ మూవీలో నటించనున్నారు. ఈ సినిమాకు సుకుమార్ స్క్రీన్ ప్లే అందించనుండగా బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. తేజుకు ఇది 15వ సినిమా.