సాయి తేజ్.. ఫుల్ ఎంటర్‌టైన్మెంట్‌ పక్కా

157
- Advertisement -

మెగా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ పక్కా కామెడీ చేసినప్పుడల్లా థియేటర్లు ఊగాయి. అలా కాకుండా డిఫెరెంట్ గా ట్రై చేద్దాం అని యాక్షన్ కథలను, డిఫరెంట్ సినిమాలను అటెంప్ట్ చేసినప్పుడే సమస్యలు ఎదురయ్యాయి. ఐతే, ఈసారి సాయి ధరమ్ తేజ్ నుంచి ఓ పక్కా కామెడీ సినిమా రాబోతుంది. హాస్య రచయిత శ్రీధర్ సీపాన రాసిన ఓ ఫుల్ ఎంటర్ టైనర్ లో సాయి ధరమ్ తేజ్ నటించబోతున్నాడు.

శ్రీధర్ సీపాన రాసిన ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్ టైన్ మెంట్ అని తెలుస్తోంది. అసలు ఎక్కడా ఓవర్ ఎమోషన్ ఉండదట. ఓన్లీ మాస్ ఆడియన్స్ టార్గెట్ అంట. పైగా ఈ సినిమా గతంలో శ్రీనువైట్ల లాంటి దర్శకులు అందించిన కన్ఫ్యూజ్ కామెడీ లైన్ లో సాగుతుందని.. తెర పై క్యారెక్టర్స్ మధ్య వచ్చే గందరగోళ సమ్మేళనం అదిరిపోతుందని తెలుస్తోంది.

నిజానికి ఒకప్పుడు దాదాపు అందరి హీరోలు ఈ టైపు సినిమాలే చేసి హిట్లు అందుకున్నారు. అంతెందుకు సాయి ధరమ్ తేజ్ కూడా పిల్లా నువ్వు లేని జీవితం అనే సినిమా చేసి హిట్ అందుకున్నాడు. అలా చేసిన ప్రతి సినిమా టార్గెట్ రీచ్ అయింది. ఈసారి కూడా శ్రీధర్ సీపాన – సాయి తేజ్ అదే మ్యాజిక్ ను నమ్ముకున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్.. డబ్బున్న ఆసామీ..పేద కుర్రాడు ఇలా రెండు పాత్రల్లో కనిపిస్తాడు. అసలు హీరోది డబుల్ రోల్ నా ?, లేక సింగిల్ రోల్ నా అన్న అనుమానంతోనే, ప్రేక్షకుడు ఫుల్ ఎంటర్ టైన్ అవుతాడట.

ఇవి కూడా చదవండి..

- Advertisement -