వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా సాయిచంద్ భార్య

92
- Advertisement -

గుండెపోటుతో ఇటీవలె మృతిచెందిన గాయకుడు,తెలంగాణ గిడ్డంగుల కార్పొరేషన్ ఛైర్మన్‌ సాయిచంద్ భార్య రజనిని వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని తెలిపారు మంత్రి కేటీఆర్. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్…సాయిచంద్ ఫ్యామిలీకి కోటిన్నర ఆర్ధిక సాయం చేస్తున్నామని ప్రకటించారు.

అదేవిధంగా  సాయి చంద్ తండ్రికి మరియు తన చెల్లి కి ఇద్దరికి చేరో  25 లక్షల రూపాయలు అదేవిధంగా తన పిల్లల పేరు మీద కూడా  25 లక్షల రూపాయలు ఫిక్సుడ్ డిపాజిట్ చేస్తున్నట్లు ప్రకటించారు కేటీఆర్.

పార్టీ కార్యకర్తలకు ఎక్కడ ఇబ్బంది కలిగినా పార్టీ నాయకత్వం అండగా ఉంటుందని.. పార్టీ కార్యకర్తల శ్రమ, త్యాగాల వలన పార్టీ నిర్మాణమైందన్నారు. టిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు కుసుమ జగదీష్, వేద సాయి చంద్ అకాల మరణానికి సంతాపం తెలిపారు కేటీఆర్.

Also Read:గుజరాత్ హైకోర్టులో రాహుల్‌కి నిరాశే

ఇటీవలె గుండెపోటుతో మరణించారు సాయిచంద్. ఆయన అంతిమయాత్రలో పాల్గొన్నారు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్. సాయిచంద్ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పినట్టుగానే ఆర్ధిక సాయం అందించడంతో పాటు ఆయన భార్యకు వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమించారు.

Also Read:MP Santhoshkumar:ప్లాస్టిక్‌ని తరిమికొడదాం

- Advertisement -