MP Santhoshkumar:ప్లాస్టిక్‌ని తరిమికొడదాం

31
- Advertisement -

ప్లాస్టిక్ భూతంపై పోరాటానికి అంత సిద్ధం అవుతున్నారు. ప్రజల్లో కాసింత అవగాహన రావడంతో ప్లాస్టిక్‌ను తరిమికొట్టేందుకు ముందుకొస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సైతం ప్లాస్టిక్‌ను అంతం చేసేందుకు ఎప్పటికప్పుడు ప్రజలను చైతన్యం చేస్తూనే ఉన్నారు.

తాజాగా సునీత నారాయణ్ రాసిన ప్లాస్టిక్ భూతానికి అంతమెప్పుడు అనే ఆర్టికల్‌ని షేర్ చేసి దీనిపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన తీసుకురావల్సిన అవసరం ఉందన్నారు ఎంపీ సంతోష్‌ కుమార్. ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన సంతోష్…అందరికి ప్లాస్టిక్‌పై అవగాహన తెచ్చేలా రాసిన ఆర్టికల్ బాగుందని…ప్లాస్టిక్ మితిమీరిన వినియోగం భయంకరమైన పరిణామాలకు దారి తీస్తుందని చెప్పారు.

Also Read:బీజేపీ దారిలోనే కాంగ్రెస్.. టోటల్ ఛేంజ్?

అందుకే ప్లాస్టిక్‌కు వీడ్కోలు పలుకుదాం…త్వరితగతిన పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలను స్వీకరిద్దాం అని చెప్పారు సంతోష్‌. మా #GreenIndiaChallengeలో చేరి మొక్కలు నాటాలని అలాగే #BeatThePlasticPollution ఉద్యమంలో చేరాలని కోరారు. అందరం కలిసి మార్పు తీసుకొద్దామని పేర్కొన్నారు సంతోష్‌.

Also Read:ఉచిత ప్రయాణం కోసం ఆడవేషం..చివరికి!

- Advertisement -