రానా దగ్గుబాటి, సాయిపల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందుతున్న వైవిధ్యమైన చిత్రం ‘విరాటపర్వం’. డి. సురేష్ బాబు సమర్పణలో ఎస్.ఎల్.వి. సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా విడుదల తేదిని ఇటివలే చిత్ర యూనిట్ ప్రకటించింది. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా జూలై 1 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. తాజాగా సాయి పల్లవి బర్త్ డే కానుగా.. వెండితెర వెన్నెల సాయి పల్లవికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ చిత్ర యూనిట్ ‘సోల్ ఆఫ్ వెన్నెల’ పేరుతో ఒక ప్రత్యేకమైన వీడియోని విడుదల చేసింది. విరాట పర్వంలో సాయి పల్లవి వెన్నల పాత్రని ఉద్దేశించి విడుదల చేసిన ఈ వీడియో ప్రేక్షకులని అమితంగా ఆకట్టుకుంది.
”వెన్నెల రెండుసార్లు జన్మించింది.. తొలిపొద్దులో ఇప్పపూలు పూసినట్టు అడవి తల్లి ఒడిలో ఒకసారి.. ఆశయాన్ని ఆయుధం చేసినట్టు అతని ప్రేమలో మరొకసారి.. సాయి పల్లవి వెన్నెల పాత్ర గురించి దర్శకుడు వేణు ఊడుగుల రాసిన ఈ మాటలు సాయిపల్లవి పాత్రపై ఆసక్తిని పెంచాయి. ”నిర్బంధాలని కౌగలించుకున్న వసంతకాలం మనది. రేపు మనం వున్నాలేకపోయిన చరిత్ర వుంటుంది, మన ప్రేమ కథని వినిపిస్తుంది” సాయి పల్లవి వాయిస్‌లో చివర్లో వినిపించిన ఈ మాటలు కవితాత్మకంగా వుండటంతో పాటు ప్రేమకథలోని లోతుని గొప్పదనాన్ని వెల్లడిస్తున్నాయి. ఈ స్పెషల్ వీడియోలో చూపించిన విజువల్స్ విరాటపర్వంలో సాయి పల్లవి పాత్రలో వైవిధ్యాన్ని ప్రజంట్ చేశాయి.
సురేష్ బొబ్బిలి అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యాజికల్ గా వుంది. సాయి పల్లవి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ‘సోల్ ఆఫ్ వెన్నెల’ వీడియో అభిమానులకు అద్భుతమైన కానుగా నిలిచింది. ఈ చిత్రానికి డానీ సాంచెజ్ లోపెజ్, దివాకర్ మణి సినిమాటోగ్రఫీ అందించగా, సురేష్ బొబ్బిలి సంగీతం సమకూరుస్తున్నారు. ప్రియమణి, నందితా దాస్, నవీన్ చంద్ర, జరీనా వహాబ్, ఈశ్వరీ రావ్, సాయిచంద్ ఇతర ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు.
తారాగణం: రానా దగ్గుబాటి, సాయిపల్లవి, ప్రియమణి, నందితా దాస్, నవీన్ చంద్ర, జరీనా వహాబ్, ఈశ్వరీ రావ్, సాయిచంద్, బెనర్జీ, నాగినీడు, రాహుల్ రామకృష్ణ, దేవీప్రసాద్, ఆనంద్ రవి, ఆనంద్ చక్రపాణి తదితరులు
సాంకేతిక విభాగం:
రచన-దర్శకత్వం: వేణు ఊడుగుల
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
బ్యానర్స్: సురేష్ ప్రొడక్షన్స్, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్
సమర్పణ: సురేష్ బాబు
సినిమాటోగ్రఫీ: డానీ సాంచెజ్ లోపెజ్, దివాకర్ మణి
ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్
ప్రొడక్షన్ డిజైన్: శ్రీనాగేంద్ర
మ్యూజిక్: సురేష్ బొబ్బిలి
స్టంట్స్: స్టీఫెన్ రిచర్డ్, పీటర్ హెయిన్
కొరియోగ్రఫీ: రాజు సుందరం
పీఆర్వో: వంశీ-శేఖర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయ్కుమార్ చాగంటి
పబ్లిసిటీ డిజైన్: ధని ఏలే