ఈ వారం OTTలో వస్తున్న సినిమాలు ఇవే..

68
ott
- Advertisement -

ఇంతకుముందు ప్రేక్షకులు ప్రతీవారం ఏ సినిమాలు వస్తున్నాయో చెక్ చేసేవాళ్లు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రతీవారం ఏయే సినిమాలు,సిరీస్ లు ఓటీటీ ప్లాట్ ఫామ్ లల్లో రిలీజవుతున్నాయో చూస్తున్నారు. దానికి తగ్గట్టు ప్రతీవారం కొన్ని సిరీస్‌లు, సినిమాలు చూసుకోవడానికి షెడ్యూల్ చేసుకుంటున్నారు. అయితే ఈ వారంలో రిలీజవుతున్న సిరీస్‌లు, సినిమాలపై ఏవో చూద్దాం..

విరాటపర్వం..
రానా సాయిపల్లవి నటించిన ‘విరాటపర్వం’ జూన్ 17న థియేటర్లలో రిలీజైంది. ఎన్నో ఎక్స్ పెక్టేషన్స్ తో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫెయిలయింది. సినిమా పరంగా బాగానే ఉన్నా ఎందుకో జనాలు థియేటర్లలో చూడటానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదు. నక్సల్ బ్యాక్ డ్రాప్, వాళ్ల ఐడియాలజీ పెద్దగా నచ్చలేదు. అందుకే నిర్మాతలు రెండు వారాలు అవ్వగానే ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా జూలై 1న నెట్ ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది. మరి ఓటీటీ లోనైనా ఈ సినిమాకు ఆదరణ లభిస్తుందో చూడాలి.

సామ్రాట్ పృథ్వీరాజ్..
అక్షయ్ కుమార్ నటించిన సామ్రాట్ పృథ్వీరాజ్ జూన్ 3న ప్రేక్షకుల ముందుకొచ్చింది. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా పెద్దగా నిలబడలేకపోయింది.ఓపెనింగ్స్ బాగానే ఉన్నా ఆ తర్వాత నిలబడలేకపోయింది.ఈ సినిమా ఇప్పుడు తెలుగు,తమిళం,హిందీ భాషల్లో అమెజాన్ ప్రైమ్ లో జులై 1 ప్రసారం కానుంది.

ఆన్యాస్ ట్యుటోరియల్..
రెజీనా, నివేదితా సతీష్ నటించిన వెబ్ సిరీస్ ‘‘ఆన్యాస్ ట్యుటోరియల్’’. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సిరీస్ జులై 1 నుండి ఆహాలో ప్రసారం కానుంది.బాహుబలి ప్రొడ్యూసర్ శోభు యార్లగడ్డ ఈ సిరీస్ కు నిర్మాత.ఈ సిరీస్ తో పాటే ఆహాలో మరో కిడ్ సిరీస్ ‘‘బాల భారతము’’ జులై 1 నుండే ప్రసారం కాబోతుంది.

హాలీవుడ్ పాపులర్ సిరీస్ ‘‘స్ట్రేంజర్ థింగ్స్’’ సీజన్ 4 – జులై 1 నుండి నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది. అలాగే హిందీ మూవీ ‘‘ధాకడ్’’ కూడా జూలై 1న జీ5 లో స్ట్రీమింగ్ కానుంది. వీటితో పాటు స్పైడర్ మాన్ 1,2,3 సీక్వెల్స్, అమేజింగ్ స్పైడర్ మేన్, స్పైడర్ మేన్ హోమ్ కమింగ్ సినిమాలు ఇంగ్లీష్ వెర్షన్‌లో హాట్ స్టార్‌లో జులై 1 నుండి అవేలబుల్ గా ఉన్నాయి.

- Advertisement -