మహేశ్‌కి చెల్లెలిగా సాయి పల్లవి?

93
mahesh
- Advertisement -

సర్కార్ వారి పాట తర్వాత సూపర్ స్టార్ మహేశ్ బాబు….త్రివిక్రమ్ కాంబోలో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తిచేసుకున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. అతడు, ఖలేజా సినిమాల తరువాత త్రివిక్రమ్- మహేష్ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ కావడంతో భారీగా అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తుండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త టీ టౌన్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో మహేష్ చెల్లి పాత్రలో యంగ్ హీరోయిన్ సాయి పల్లవి కనిపించనున్నదట. కీలక పాత్ర కావడంతో సాయి పల్లవి అయితే బావుంటుందని మేకర్స్ భావించగా సాయి పల్లవి కూడా ఓకే చెప్పిందట. ఈ చిత్రంలో మహేష్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది.

- Advertisement -