మార్కెట్‌లోకి మరో కొత్త ఓటీటీ..

57
ott
- Advertisement -

కరోనా,లాక్ డౌన్ వేళ థియేటర్లు బంద్ కావడంతో ఓటీటీలకు డిమాండ్ పెరిగిపోయింది. చిన్న సినిమాలే కాదు పెద్ద సినిమాలు సైతం ఓటీటీల బాట పడుతుండటంతో ఓటీటీ మార్కెట్ కాంపిటీషన్ పెరిగిపోయింది.

తాజాగా సన్ షైన్ అనే ఓటిటి యాప్ లాంచింగ్‌ వేడుక హైదరాబాద్‌లోని దస్‌ పల్లా హోటల్‌లో జరిగింది. ప్రముఖ కన్నడ దర్శకుడు ప్రభాకర్, యువ హీరో రాం కార్తీక్‌లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ ఓటిటిని శివప్రసాద్ స్థాపించారు. ప్రస్తుతం సన్ షైన్ ఓటిటి గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉందని తెలిపారు.

ఈ ఓటిటిలో సినిమా కంటెంట్ మాత్రమే కాకుండా వెబ్ సిరీస్, గేమ్స్, స్పోర్ట్స్, లైవ్ న్యూస్, కిడ్స్ కంటెంట్, ఈవెంట్స్, లైవ్ ఈవెంట్స్ లాంటి అన్ని రకాల కంటెంట్‌తో త్వరలో ప్రేక్షకులకు పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్‌ అందించనుంది.

- Advertisement -