కోలివుడ్‌కు షిఫ్ట్‌ అవుతున్న సాయిపల్లవి….

242
- Advertisement -

ప్రేమమ్‌ సినిమా ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైన హీరోయిన్‌ సాయిపల్లవి. మలయాళం ప్రేమమ్‌ సినిమాలోని మలర్‌ అనే క్యారక్టర్‌తో ఎంత క్రేజీ సంపాందించిందో తెలుగులో కూడా సితార అనే క్యారక్టర్‌ ద్వారా అంతే క్రేజ్‌ తెచ్చుకుంది. కొంచెం కూడా మేకప్‌ లేకుండా తన ఒరిజినల్‌ అందంతో ఆకట్టున్న బ్యూటీ ఏవరైన ఉన్నరంటే అది సాయిపల్లవి మాత్రమే. సాయి పల్లవి ప్రస్తుతం వరణ్‌ తేజ్‌ హీరోగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఫిదా’ చిత్రంలో నటింస్తుంది.

Sai Pallavi Shift to Kollywood

అయితే ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలో కూడా తన సత్తా చాటేందుకు బయల్దేరిందట సాయిపల్లవి. మాధవన్‌ లీడ్‌రోల్‌లో చేయనున్న సినిమాలో సాయిపల్లవిని హీరోయిన్‌గా ఫైనల్‌ చేశారట. మలయాళ మూవీ చార్లీకి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కనుంది. దీనిపై ఈ చిత్ర నిర్మాత శృతి నల్లప్ప మాట్లడుతూ…’కొన్ని నెలల క్రితమే మలయాళ చిత్రం చార్లీ రైట్స్ ను కొనుగోలు చేశాం. దర్శకుడు విజయ్ తమిళ్ ఆడియన్స్ కు వీలుగా ఈ చిత్ర కథ కథనాల్లో మార్పులు చేశాడు. ఇప్పుడు ఒరిజినల్ మూవీ కంటే చాలా డిఫరెంట్ గాను బెటర్ గాను స్క్రిప్ట్ సిద్ధమైంది. మార్చ్ మొదటి వారంలో షూటింగ్ ప్రారంభించబోతున్నాం…. సాయి పల్లవిని హీరోయిన్ గా తీసుకున్నాం’ అని తెలిపారు. ఈసినిమాకి విజయ్‌ దర్శకత్వం వహిస్తుంన్నాడు.

Sai Pallavi Shift to Kollywood

ప్రస్తుతం ‘ఫిదా’ చిత్రంతో బిజీగా ఉన్న సాయిపల్లవి….యంగ్ హీరో సందీప్ కిషన్‌కు సరసన కూడా నటించేందుకు సైన్ చేసిందట ఈ అమ్మడు. షో, ఆరెంజ్ వంటి చిత్రాలలో నటించి ఆకట్టుకున్న స్టార్ హీరో మహేష్‌బాబు సోదరి మంజుల ఈ మూవీ ద్వారా డైరెక్టర్‌గా పరిచయం కానుండడం విశేషం. ఈ చిత్రంలో సందీప్ కిషన్ న్యూ లుక్‌లో కనిపిస్తాడట. గోవా, లండన్‌తో పాటు ఇండియాలోని కొన్ని ప్రాంతాల్లో ఈ మూవీ షూటింగ్‌ను జరుపనున్నారు. ఫిబ్రవరిలో ఈ షూటింగ్ ప్రారంభం కాబోతుంది.ఈ సినిమాకి జెమినికిరణ్‌ నిర్మాతగా వ్యవహారించనున్నాడు. మొత్తంమీద సాయిపల్లవి ఇటూ టాలీవుడ్‌లోను కోలీవుడ్‌లోనూ బిజీస్టార్‌గా మారునుంది.

- Advertisement -