ప్రియాంక @ పీపుల్స్ చాయిస్‌

239
Priyanka wins People’s Choice Awards for Quantico
- Advertisement -

ప్రియాంక చోప్రా.. పరిచయం అక్కర్లేని పేరు. బాలీవుడ్‌లో సత్తాచాటిన ఈ బ్యూటీ హలీవుడ్‌లో సైతం పాగావేసింది. తన అందచందాలను ఆరబోస్తోంది. ఏ మాత్రం మొహమాటలకు పోకుండా క్లీవెజ్‌ షోను ప్రదర్శిస్తోంది. అందాల ప్రదర్శనలో లేటెస్ట్ ట్రెండ్‌ను సెట్ చేస్తూ ముందుకు సాగుతున్న ప్రియాంక క్వాంటికో సిరీస్‌తో తెగ పాపులరైపోయింది.

ఈ టీవీ సిరీయల్‌లో నటించినందుకు గాను ప్రియాంకాకు పీపుల్స్ చాయిస్ అవార్డు వరించింది. లాస్ ఏంజిల్స్‌లోని మైక్రోసాఫ్ట్ థియేట‌ర్‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ప్రియాంకా ఈ అవార్డును అందుకున్నారు. ఈ అవార్డు ద‌క్క‌డం చాలా ఆనందంగా ఉంద‌ని త‌న‌తో పాటు నామినేట్ అయిన తోటిన‌టీమ‌ణుల‌కు అభినంద‌నలు తెలిపింది ప్రియాంకా. వారంద‌రి స‌హ‌కారంతోనే బుల్లితెర‌పై కూడా రాణిస్తున్న‌ట్లు తెలిపారు. త‌ను ఇంత‌టి స్థాయికి చేరేందుకు స‌హ‌క‌రించి మ‌ద్ద‌తు తెలిపిన ప్ర‌తిఒక్క‌రికీ ధ‌న్య‌వాదాలు తెలిపింది ప్రియాంకా.క్వాంటికో సిరీస్‌లో ప్రియాంకా ఎఫ్‌బీఐ రిక్రూట్ పాత్ర‌ను పోషించింది.

ఇటీవలె ప్రియాంక చోప్రా క్వాంటికో షూటింగ్‌లో గాయపడిన సంగతి తెలిసిందే. క్వాంటికో యాక్షన్ సీన్ చేసే సమయంలో గాయపడగా ఆమె తలకు స్వల్పంగా గాయాలయ్యాయి. చివరి షెడ్యూల్‌ షూటింగ్‌ జరుగుతున్నప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది.

- Advertisement -