మరోసారి భారీ ఆఫర్ ను తిరస్కరించిన సాయిపల్లవి

244
sai pallavi
- Advertisement -

కెరీర్ ప్రారంభం నుంచి గ్లామర్ పాత్రలను పక్కనపెట్టి కేవలం కథకు ప్రాధాన్యం ఉన్న పాత్రలకే ప్రాధాన్యత ఉన్న సినిమాల్లో నటిస్తోంది హీరోయిన్ సాయిపల్లవి. ఫిదా సినిమాలో తన నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఫిదా మూవీలో పక్కా పల్లెటూరి పిల్ల పాత్రలో నటించి అందరి మనసులు గెలుచుకుంది. ఆ తర్వాత నానితో ఎంసిఏ, పడి పడి లేచే మనసు చిత్రాల్లో నటించింది. కెరీర్ ప్రారంభం నుంచి కమర్షియల్ సినిమాల వైపు కాకుండా వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ మంచి గుర్తింపు పొందింది.

తాజాగా ఉన్న సమాచారం మేరకు సాయి పల్లవి ఓ భారీ ఆఫర్ ను వదులుకుందట. ఓ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ చేయడానికి సాయి పల్లవిని సంప్రదించారట చిత్రయూనిట్. ఇందుకుగాను ఆమెకు కోటిన్నర రూపాయలు ఆఫర్ చేశారట. ఈ ఆఫర్ ను సాయిపల్లవి సున్నితంగా తిరస్కరించిందని సమాచారం. గ్లామర్ పాత్రలను తాను ఎట్టిపరిస్ధితులల్లో చేయబోనని చెప్పిందట. హీరోయిన్గా చేస్తూ ఐటెం సాంగ్ లలో నటించడం తనకు ఇష్టం లేదని చెప్పిందట. ఇక సాయిపల్లవి ప్రస్తుతం తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో పలు సినిమాలు చేస్తుంది. తెలుగులో రానాతో విరాటపర్వం సినిమాతో పాటు శేఖర్ కమ్ముల నాగచైతన్య కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లవ్ స్టోరీ సినిమాలో నటిస్తుంది. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకొవాలని చూస్తున్న హీరోయిన్లు ఉన్న ఈ కాలంలో ఇంత పెద్ద ఆఫర్ ను వదులుకొవడం సాయిపల్లవికే సాధ్యం అంటున్నారు సినీ విశ్లేషకులు.

- Advertisement -