రాష్ట్రంలో రాగల మూడురోజుల వాతావరణ సూచన..

236
rains
- Advertisement -

నైఋతి బంగాళాఖాతం మరియు దానిని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాలలో 2.1 km నుండి 4.5 km ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది ఎత్తుకు వెళ్ళే కొద్దీ నైఋతి దిశ వైపుకు వంపు తిరిగి ఉన్నది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు అక్కడక్కడ తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురుసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

అదే విధంగా రేపు కొన్ని చోట్ల.. అలాగే ఎల్లుండి అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఒకటి రెండుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

- Advertisement -