సాయి పల్లవి కి ఇప్పుడు హీరోయిన్ గా విపరీతమైన క్రేజ్ ఉంది. ఆమె నటించిన సినిమాలు.. పల్లవి నటన.. డ్యాన్స్.. అన్నీ ఆడియన్స్ ను మురిపించేస్తున్నాయి. తెరపై సాయిపల్లవి నటన చూసిన వాళ్లెవరూ ఆమె అభిమానులుగా మారకుండా ఉండలేరు. కానీ ఇదే సమయంలో ఆమె బాగా పొగరుబోతు అనే టాక్ కూడా ఎక్కువగానే వినిపిస్తోంది. డోంట్ కేర్ అన్నట్టుగా ఆమె వ్యవహరిస్తుందనీ .. షూటింగుకి చెప్పిన సమయానికి రాకుండా ఇబ్బంది పెడుతుందనే వార్తలు ఇటు తెలుగులోను .. అటు తమిళంలోను వినిపిస్తున్నాయి.
తాజాగా భాగ్యరాజా తనయుడు శంతను భాగ్యరాజా తన దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు మొదలుపెట్టాడు. నిత్యా మీనన్.. సాయి పల్లవి హీరోయిన్లుగా శంతను భాగ్యరాజా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఈ మూవీకి సాయి పల్లవి యాక్టింగ్ ప్లస్ అవుతుందని కూడా అంచనా వేసుకొచ్చారు. అయితే ఇప్పుడు సాయిపల్లవిని ఈ మూవీ నుంచి తప్పించి ఆమె ప్లేస్ లో సమంతను తీసుకున్నారనే న్యూస్ వైరల్ అవుతోంది. ఇందుకు అమె ప్రవర్తనే అని టాక్ వినిపిస్తోంది. ఈ విషయంలో ఇంకా అధికారిక ప్రకటన రావాల్సివుంది.