వివాదంలో హీరోయిన్ సాయి పల్లవి..!

110
- Advertisement -

తన యాక్టింగ్‌తో యాటిట్యూడ్‌తో అందరినీ మెస్మరైజ్ చేస్తున్న స్టార్ హీరోయిన్ సాయి పల్లవి తనకు తెలియకుండానే వివాదంలో చిక్కుకుంది. తను నటించిన విరాటపర్వం మూవీ ఈ నెల 17న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్‌లో యాక్టివ్‌గా పాల్గొంటుంది సాయి పల్లవి. ఇందులో భాగంగా ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ తనకు తలనొప్పి తెచ్చి పెట్టింది. ఆ ఇంటర్వ్యూలో సాయి పల్లవి నక్సల్స్ విషయం గురించి మాట్లాడింది. నక్సల్స్ ది ఒక ఐడియాలజీ. మనకు శాంతి అనేది ఒక ఐడియాలజీ. నాకు వయిలెన్స్ అంటే నచ్చదు. వయిలెంట్ గా ఉండి మనం ఏమి సాధించలేమనేది నా అభిప్రాయం అంటూ చెప్పుకొచ్చింది.

మాటల్లో మాటగా ‘కశ్మీర్ ఫైల్స్’ సినిమా గురించి సంచలన కామెంట్ చేసింది. “మా ఫ్యామిలీలో లెఫ్ట్ రైట్ అని ఉండదు.న్యూట్రల్ గా ఉండే ఫ్యామిలీలో పెరిగాను. ఎవరో ఎవరినో హర్ట్ చేస్తున్నారని మనం కూడా చేయకూడదు. బాధితుల గురించి ఆలోచించాలి. కొన్ని రోజుల క్రితం ‘ది కశ్మీర్ ఫైల్స్’ అనే సినిమా వచ్చింది కదా? .. ఆ టైమ్‌లో ఉన్న కశ్మీరీ పండిట్లను ఎలా చంపారో చూపించారు కదా? .. మనం మత ఘర్షణలా వాటిని చూస్తే.. రీసెంట్ గా ఓ బండిలో ఆవులని తీసుకెళ్లున్నారని ఆ వెహికిల్ ని నడుపుతున్న వ్యక్తి ముస్లీం అని కొంత మంది కొట్టి జై శ్రీరామ్ అన్నారు. అప్పుడు జరిగిన దానికి ఇప్పుడు జరిగిన దానికి తేడా ఎక్కడుంది.’’ అంటూ మాట్లాడేసింది.

ఈ వ్యాఖ్యలను పట్టుకొని ఆ సినిమా ఫ్యాన్స్,కొందరు హిందూత్వ వాదులు సాయి పల్లవి మీద ఫైర్ అవుతున్నారు. తన ‘‘విరాట పర్వం’’ సినిమాను బ్యాన్ చేయాల్సిందే అంటూ కామెంట్స్ పెడుతున్నారు.కొందరైతే నీ సినిమా మేము చూడం.క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ మండిపడుతున్నారు. అయితే కొందరు సాయిపల్లవికి సపోర్ట్ గా మాట్లాడుతున్నారు.ఆమె వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకుంటున్నారనీ, తన ఉద్దేశ్యం అది కాదని సమర్థిస్తున్నారు. మొత్తానికి ఈ వీడియో క్లిప్ వైరల్ అయింది.ఆమె చేసిన వ్యాఖ్యలు చిలికి చిలికి గాలి వానగా మారాయి. మరి దీనిపై ఆమె ఎలా రియాక్టవుతారో,లేదా క్షమాపణలు చెప్తారో చూడాలి.

- Advertisement -